సిపిఐ(ఎం) తోనే నగర సమస్యలు పరిష్కారం...


 *సిపిఐ(ఎం) తోనే నగర సమస్యలు పరిష్కారం...*

 

నగర సమస్యలపై దశల వారి ఆందోళనలు 

అర్హులైన వారందరికీ ఇండ్లు ,ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి

విలేకరుల సమావేశంలో సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ 



ఖమ్మం నగరంలోని సమస్యలు సిపిఐ(ఎం) తోనే పరిష్కారాలు అవుతాయని , ప్రజలను భాగస్వాములను చేసి నగరంలో ప్రజా పోరాటాలు ఉదృతం చేస్తామని సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగర అభివృద్ధిలో సిపిఎం పాత్ర ఎంత ఉందని, చిర్రావూరి లక్ష్మీనరసయ్య దగ్గర నుండి నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది సిపిఎం మాత్రమేనని అన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో నగరంలోని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పి కేవలం 3500 మందికి మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని, నగరంలో సుమారు 20వేల మంది వరకు అర్హులైన వారు ఉన్నారని, వారికి గత ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో అర్హులైన నిరుపేద, మధ్యతరగ కుటుంబాలకు ఇండ్లు ,ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు అందజేయాలని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పెన్షన్ 4000 ఇస్తామని హామీలు ఇచ్చిందని ,అది ఎక్కడ అమలు చేయడం లేదని, కనీసం చనిపోయిన వారి స్థానంలో మరొకరికి ఇవ్వడంలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ను పెంచి అర్హులైన వారందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖమ్మం విద్యా హబ్ గా ఉందని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ఇది గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు హామీ ఇచ్చారని, విద్యార్థులు వరంగల్ ,హైదరాబాద్ వెళ్లకుండా విద్యార్థులకు యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుందని ,దానికి అనుగుణంగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలని, అదేవిధంగా కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో కార్మికులు ఈఎస్ఐ ఆసుపత్రి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఖమ్మం ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని ఈఎస్ఐ హాస్పిటల్ ను ఏర్పాటు చేసి ఆసుపత్రిలోనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. నాగపూర్, అమరావతి అలైన్మెంట్ మార్చాలని, భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ రేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్ఎస్పి, ప్రభుత్వ భూములు పలు ప్రాంతాల్లో కబ్జాలు గురయ్యాయని, వాటిని ఎవరు కబ్జా చేసిన అలాంటి వారిపై కఠిన చర్య తీసుకొని , ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఖమ్మంలోనే నిత్యం వేలాదిమంది వివిధ పనులపై వస్తుంటారని వారికి ట్రాఫిక్కు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు దాటాలంటే ఇబ్బందికరంగా మారుతుందని, అధికారులు గమనించి వైరా రోడ్లు 3 ఫుట్వేర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని అన్నారు. వికలాంగుల కాలనీ, ఎల్.బి నగర్ వాసుల ఇబ్బందులను అధికారులు గమనించి 

 సాగర్ పై బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. అదేవిధంగా కమాన్ బజార్ నుండి గాంధీ చౌక్ వైపు మధ్య గేట్ వద్ద ప్రజలు ఇబ్బందులను గమనించి మంత్రులు ,ఎంపీలు రైల్వే అధికారులతో మాట్లాడి ప్రజల సౌకర్యార్థం ఫుట్వేర్ బ్రిడ్జి ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సారధి నగర్, మామిళ్లగూడెం అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ఆగకుండా శాశ్వత పరిష్కారం చేయాలని అన్నారు .నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు .ఖమ్మంలోని పైపులైన్ల కోసం కొన్ని టెలికం సంస్థలు, మిషన్ భగీరథ పైప్ లైన్ ల కోసం తవ్వకాలు జరుపుతూ ఆ గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారని, దానివలన వాహందారులు పాదచారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే గుంతలను పూర్చి సమస్యను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా నగరంలోని బస్ డిపో , ఎన్ఎస్టీ , ఆర్డీవో కార్యాలయం , రైల్వే స్టేషన్, ఖిల్లా , దానవాయిగూడెం ,గోపాలపురం, పాత సిపిఐ కార్యాలయం రోడ్లను 80 అడుగులుగా వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లోని కుక్కలు, కోతులు బెడద తీవ్రంగా ఉందని , నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలోని రైతులు, కార్మికులు సౌకర్యార్థం ఏరియా హాస్పిటల్ , మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని ,అదేవిధంగా ఐదు రూపాయలు భోజనం క్యాంటీన్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా నగర శివారు ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న దానవాయిగూడెం డంపింగ్ యార్డ్ కు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఖానాపురం, లకారం చెరువుల అలుగు ప్రాంతాల్లోని కబ్జా గురైన వాటిని తొలగించి నివారణ చర్యలు చేపట్టి సైడ్ వాల్స్ ను నిర్మించాలని కోరారు . నగరంలోని పలు ప్రాంతాల్లో స్మశాన వాటికలు నిర్మించాలని అన్నారు. రఘునాధపాలెం మండలంలోని 19 గ్రామ పంచాయతీ లలో భవనాలు, సిసి రోడ్లు, వీధిలైట్లు , కోసం నిధులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు. సమస్యలపై దశల వారీగా ఆందోళన నిర్మిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం. ఏ జబ్బార్, ఖమ్మం అర్బన్ మండల కార్యదర్శి బత్తిని ఉపేందర్, వన్ టౌన్ కార్యదర్శి ఎస్కె నాగులు మీరా, త్రీ టౌన్ కార్యదర్శి భుక్యా శ్రీను తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్