*CM కప్ 2024 నీ ప్రారంభించిన ఉప్పల*
*CM కప్ 2024 నీ ప్రారంభించిన ఉప్పల*
హైద్రాబాద్:
ఉప్పల్ లోని ELITE GARAGE లో నిర్వహించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ సెలక్షన్స్ లో పాల్గొని పోటీలను ప్రారంభించిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ సీఎం కప్ 2024 నీ ప్రారంభించడం సంతోషం అని గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.
మతాలకు అతీతంగా అందరూ కలిసే చోటు క్రీడామైదానం ఒక్కటే. యువత వ్యసనాల జోలికి పోకుండా క్రీడలవైపు మళ్లాలి. విశ్వ క్రీడల్లో మెడల్స్ సాధించాలి. మీకు అవసరమైన సహకారాన్ని ప్రజా ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన అన్నారు.
ఈ పోటీల్లో అండర్ 15 మరియు 19 విభాగాల నుండి 100 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో DYSO మేడ్చల్ మల్కాజ్ గిరి గోపాల్ , బ్యాడ్మింటన్ కోశాధికారి హర్ష యాదవ్ , ELITE Gamer's Garrage Management Vikanth Coach క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment