SETWIN నల్లగొండ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి ఉపాధ్యాయులు ఎంపిక కు దరఖాస్తులకు ఆహ్వానం
SETWIN నల్లగొండ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రానికి ఉపాధ్యాయులు ఎంపిక కు దరఖాస్తులకు ఆహ్వానం
నల్గొండ:
ఈ నెల 7వ తేదీన నల్గొండ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన SETWIN వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సుమారు ( 26 ) కోర్సులలో శిక్షణ అందించడానికి కావాల్సిన యంత్ర పరికరాలను ఇతర పనిముట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా కోర్సులలో శిక్షణ అందించడానికి ఈ క్రింది అంశాలలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేయాలనీ నిర్ణయించడం జరిగిందని SETWIN మేనేజింగ్ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
పై కోర్సులకు సంబంధించి అర్హతగల ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 18 వ లోపు సెట్విన్ శిక్షణ కేంద్రం, కేపీఆర్ కాలేజీ వద్ద, దేవరకొండ రోడ్డు, నల్గొండ వద్ద అన్ని పనిదినాలలో సంప్రదించి దరఖాస్తులను లేదా కేంద్రం ఇంచార్జి M. సరిత ఫోన్ నెంబర్ 9705041789 ద్వారా ఇతర వివరాలు పోందవచ్చనీ, ఆయా కోర్సులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు రూ.15 వేల నుండి రూ.20 వేల వరకు వేతనం అందించడం జరుగుతుందనీ, ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికం ఎట్టి పరిస్థితుల్లోనూ రెగ్యూలరైజ్ చేయబడనీ తెలిపారు
Comments
Post a Comment