మూసి లో అక్రమంగా వ్యర్థాల పోసిన ఇష్యూ లో రుద్ర టెక్నాలజీస్ మూసివేత ఉత్తర్వును జారీ చేసిన TGPCB


 

మూసి లో అక్రమంగా వ్యర్థాల పోసిన ఇష్యూ లో రుద్ర టెక్నాలజీస్ మూసివేత ఉత్తర్వును జారీ చేసిన TGPCB

  

03.12.202. "ఈ విషయం పై ఓ ప్రకటన విడుదల చేసిన 

టీజీపీసిబి

 *ప్రకటన వివరాలు:* 


 26.11.2024 @ 1:30 AM న మూసీ నదిలోకి ట్యాంకర్ ట్యాంకర్ నంబర్ AP 28 TD 4699 ద్వారా అక్రమంగా వ్యర్ధాలను విడుదల చేస్తున్నప్పుడు లంగర్ హౌస్ నివాసితులు మూసీ నదిలో వ్యర్థాలను వదులుతుండగా పట్టుకున్నారు, బాపుఘాట్ బ్రిడ్జి, హైదర్‌గూడ, అత్తాపూర్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ (ఎం), ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. 

  ఈ విషయమై ఎస్‌హెచ్‌ఓ, పిఎస్ రాజేంద్ర నగర్ సిఆర్.నెం.1157/2024 యు/ఎస్.280, 125 బిఎన్‌ఎస్ ద్వారా కేసు నమోదు చేశారు. 

 టిజిపిసిబి అధికారులు వ్యర్ధాలు వదిలిన ప్రాంతాన్ని పరిశీలించారు దాంతో బాటు బాపు ఘాట్ వంతెన సమీపంలో మూసీ నది పక్కన ఇసుక & కంకర మెటల్ ట్రేడింగ్ సైట్‌ను పరిశీలించారు ఆ ఆవరణలో లారీల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలం నుండి పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడం చూశారు. మూసీ నదిలోకి పైప్‌లైన్ తో వ్యర్థాలను ట్యాంకర్లతో దాపరికంగా విడుదల చేస్తున్నారు అని గమనించారు. ఆ ప్రాంత నీరు, కలుషితమైన మట్టి నుండి నమూనాలను సేకరించారు, నమూనాలు మూసీ నది ఒడ్డు నుండి కూడా సేకరించారు. 


 ఇక, టీజీపీసీబీ అధికారులు రాజేంద్ర నగర్ పీఎస్‌ని సందర్శించి ట్యాంకర్ నెం. AP 28 TD 4699 (సుమారు 12-15 KLD వ్యర్ధాలు ఇందులో ఉన్నాయి) వారి ఇన్‌వాయిస్‌ను ధృవీకరించారు, 25.11.2024 నాటి ఇన్‌వాయిస్ ప్రకారం, పంపబడిన వ్యర్థాలు, రుద్ర టెక్నాలజీస్ (గతంలో M/s. శ్రీనివాస ల్యాబ్స్), ప్లాట్ నెం. 228, ఫేజ్-II, IP, పాశమైలారం, పటాన్‌చెరు (M), సంగారెడ్డి జిల్లా నుండి M/s.రాఘవేంద్ర కెమికల్, ప్లాట్ నెం.14/B1/A2, కరణ్‌కోట్ (V), తాండూరు (M), వికారాబాద్ జిల్లా కి తెచ్చారు.


 అంతకుముందు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ కెంపెనీ కి మూసివేత ఉత్తర్వులు జారీ చేసింది కూడా. ఈ రాఘవేంద్ర కెమికల్స్ 11.04.2023 న అటవీ ప్రాంతంలోకి మురుగునీటిని విడుదల చేసిన తరువాత ఇప్పటి వరకు పనిచేయడం లేదు.


వాడేసిన ఆమ్లాలను ఉపయోగించి జిప్సం తయారీలో ఈ పరిశ్రమ పాల్గొంది.


టీజీపీసీబీ అధికారులు తనిఖీలు చేశారు ఈ రుద్ర టెక్నాలజీస్ పరిశ్రమ ను (గతంలో M/s. శ్రీనివాస ల్యాబ్స్). 26.11.2024న తనిఖీ సమయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమీపంలోని పరిశ్రమల నుండి రహదారిలోని CC కెమెరా ఫుటేజీని కూడా వీక్షించారు. దాంతో బాటు ఆ ట్యాంకర్ అంటే AP 28 TD 4699 నుండి వస్తున్న వ్యర్థ జలాలను కూడా ధృవీకరించారు. 25.11.2024న ఉదయం 5 గంటల ప్రాంతంలో పరిశ్రమను కూడా పరిశీలించారు. కాలుష్య నియంత్రణ మండలి విధించిన CFO షరతులను కూడా ఈ పరిశ్రమ పాటించకపోవడం గమనించారు. 

ఇలా ఈ పరిశ్రమ అక్రమ రవాణా తో ట్యాంకర్ నెం. AP 28 TD 4699 ద్వారా బాపూఘాట్ వంతెన సమీపంలో మూసీ నదిలోకి అంటే హైదర్‌గూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్ (M), రంగారెడ్డి జిల్లా లో వ్యర్థ జలాలను విడుదల చేయడం కూడా ధృవీకరించారు. 

ఈ విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న కాలుష్య నియంత్రణ మండలి ఈరోజు మూసివేత ఉత్తర్వును జారీ చేసింది ఈ రుద్ర టెక్నాలజీస్ కి (గతంలో M/s. శ్రీనివాస ల్యాబ్స్). ఈ పరిశ్రమ సంగారెడ్డి జిల్లా లో ఉంది.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్