Posts

Showing posts from January, 2025

అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Image
అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం - మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ:   అర్హత కలిగిన పేద జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా ఫోటోలు క్రీడా పోటీల్లో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతు ప్రధానం చేయడంతో పాటు, అర్హులైన జర్నలిస్టులకు ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50 శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50% రాయితో కూడిన ఉచిత వైద్య సేవలను అందించడం అభినందనీయం అన్నారు. నల్లగొండ పట్టణంలో అర్హత కలిగిన జర్నలిస్టులకు గతంలో దివంగము దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాని సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు పట్టాల పంపిణీ ఆలస్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలో పేదలందరికీ ఇండ్లను ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని పేద విలే...

15 వేల లంచం తో దోరికిన అసిస్టెంట్ వెటరినరీ సర్జన్

Image
  15 వేల లంచం తో దోరికిన అసిస్టెంట్ వెటరినరీ సర్జన్ అదిలాబాద్:  డాక్టర్ రాథోడ్ రమేష్, అసిస్టెంట్ వెటరినరీ సర్జన్, వెటరినరీ హాస్పిటల్, ష్యాంపూర్, ఉత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లాలోని ఫిర్యాదుదారు నుండి రూ.15,000/- లంచం డిమాండ్ చేసి, స్వీకరించినందుకు పట్టుబడ్డాడు ఫిర్యాదు దారుని తండ్రిఅదే హాస్పిటల్‌లో వెటరినరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నందున అక్టోబర్ & నవంబర్ -2023 నెలల Non-payment సర్టిఫికేట్లు జారీ చేయడానికి". లంచం డిమాండ్ చేశారు. గతం లో ఫిర్యాదుదారుని తండ్రి బదిలీకి సంబంధించిన LPC (లాస్ట్ పే సర్టిఫికేట్) జారీ చేయడానికి రూ.3000/- డిమాండ్ చేసి నిందిత అధికారి స్వీకరించాడు.

దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించిన TGPCB ఉద్యోగులు

Image
  దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించిన TGPCB ఉద్యోగులు హైద్రాబాద్:  అమరవీరుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) ఉద్యోగులు దేశం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. గౌరవ సూచకంగా, జనవరి 30, 2025న ఉదయం 11:00 గంటలకు సనత్‌నగర్ ప్రధాన కార్యాలయంలో 2 నిమిషాల మౌనం పాటించారు. సభ్య కార్యదర్శి జి రవి ఉద్యోగులు మరియు సిబ్బంది సమావేశమై దేశం కోసం ప్రాణాలను అర్పించిన ధైర్య అమరవీరులకు నివాళులర్పించా రు.  

తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

Image
  తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది.

ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వ‌ర‌కు జ‌రిగిన అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వర్నెన్స్‌

Image
ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వ‌ర‌కు జ‌రిగిన అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వర్నెన్స్‌ లేఖ యధాతధంగా గౌ// ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ రాష్ట్రం హైద‌రాబాదు అయ్యా ! పేద‌ల‌కు ఇళ్ళు క‌ట్టించి ఇవ్వ‌డానికి 2004 సంవ‌త్స‌ర‌ములో పెద్ద ఎత్తున ఇందిర‌మ్మ ఇళ్ళు కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింది. అందులో భాగంగా 2004 నుంచి 2014 వ‌ర‌కు 33.4 ల‌క్ష‌ల ఇళ్ళ‌ను మంజూరు చేసినారు. అయితే ఈ కార్య‌క్ర‌మం మంచి ఉద్ద్యేశ్యంతో చేప‌ట్టిన అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు చివ‌ర‌కు ల‌బ్ధిదారులు కుమ్మ‌క్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారు. మొత్త‌ము 33.4 ల‌క్ష‌ల ఇళ్ళు మంజూరు అవ్వ‌గా దానిలో 20.49 ల‌క్ష‌లు పూర్తి అయిన‌ట్లు చూపించినారు, కాని అందులో కూడ‌ కొన్ని ప‌నులు మొద‌లుపెట్ట‌లేదు. ఇంకా కొన్ని స‌గ‌ము వ‌ర‌కు ప‌ని జ‌రిగి ఆగిపోయినాయి. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణ‌ము జ‌ర‌గ‌కున్నానిర్మాణ‌ము జ‌రిగిన‌ట్లు, కొన్ని సంద‌ర్భాల‌లో ఎప్పుడో క‌ట్టిన ఇల్లు కూడ కొత్త‌గా క‌ట్టిన‌ట్లు చూపించి డబ్బులు చెల్లించినారు. దీనికి స్థానిక రాజ‌కీయ‌నాయ‌కులు స‌హాయ స‌హ‌కారాలు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈవి...

తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిచే PCB ఉద్యోగుల సంఘం డైరీ విడుదల

Image
 తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిచే PCB ఉద్యోగుల సంఘం డైరీ విడుదల   హైద్రాబాద్:  ఈ రోజు 28.01.2025 (మంగళవారం) తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీమతి A. శాంతి కుమారి, తన కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) ఉద్యోగుల సంఘం డైరీ 2025 ను అధికారికంగా విడుదల చేశారు.  TGPCB ఉద్యోగుల సంఘం డైరీ 2025 ఉద్యోగులకు ముఖ్యమైన వనరు గా పనిచేస్తుంది, ఇందులో ముఖ్యమైన తేదీలు, అంతర్గత సంఘటనలు, విధాన నవీకరణలు మరియు రాష్ట్ర పర్యావరణ రక్షణ మరియు కాలుష్య నియంత్రణ చర్యలలో వారి పాత్రలకు సంబంధించి కీలక సమాచారం ఉన్నాయి. TGPCB ఉద్యోగుల సంఘం డైరీ 2025 సంస్థ యొక్క విజయాలను, ముఖ్యమైన మైలురాళ్లను మరియు తెలంగాణలో కాలుష్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉద్యోగులను మార్గనిర్దేశం చేసే కొనసాగుతున్న కార్యక్రమాలను హైలైట్ చేస్తుంది. సంఘం అధ్యక్షుడు శ్రీవత్సవ్ TGPCB సంఘం డైరీని విడుదల చేసినందుకు ముఖ్య కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘం అధ్యక్షుడు శ్రీవత్సవ్, ప్రధాన కార్యదర్శి డి.కృపానంద్, సంయుక్త కార్యదర్శి కుమారి సుమతి జగన్నాధ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి స్వప్న, సాంస్కృ...

మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ

Image
 మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ  కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు  కురుమలు అధిక సంఖ్యలో ఉన్న సమాజంలో నష్టపోయాం  కురుమల పోరాటానికి కే ఆర్ పి ఎస్ మద్దతు కావాలి  కురుమ ఎమ్మెల్యే కురుమ ఎమ్మెల్సీ కూడా గొల్ల కురుమనే అంటున్నారు ఇంకా గుర్తింపు రాకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి స్వయంకృతాభిరాధం జర్నలిస్టులు కళాకారులు రాజకీయ నాయకులు గొల్ల కురుమ అనడం వల్లనే నష్టాన్ని పూడ్చలేకపోతున్నామని  ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి కురుమ డొల్ల గొంతుల మద్దతు ఉంటుందని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసా జహంగీర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గొంగడితో సన్మానం చేసి డోల్ల చప్పుడుతో మద్దతు తెలిపారు. మాదిగలకు జరిగిన అన్యాయమే తిరుమలకు జరుగుతుందని గొల్ల కురుమల మధ్య ఇలాంటి వివాదం నడుస్తుందన్నారు రాజకీయాలకు చెందుతున్నది కురుమల పేరు చెప్పుకొని గొల్లలు నడుపుతున్నరన్నారు. మందకృష్ణ చేస్తున్న పోరాటానికి మద్దతుడుతున్నట్టు సమాజ హితం క...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై , కానిస్టేబుల్

Image
  లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై , కానిస్టేబుల్ SI, constable caught by ACB while taking bribe అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న తిరుమలగిరి పోలీసులు లక్ష రూపాయల లంచం ఇస్తే వదిలేస్తానన్న ఎస్సై.. ఈ క్రమంలో పీఎస్ పై ఏసీబీ రైడ్ లంచం తీసుకుండగా పట్టుబడ్డ ఎస్సై సురేష్ , కానిస్టేబుల్ నాగరాజు

ACB వలలో ఇద్దరు

Image
  ACB వలలో ఇద్దరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్ 32వ వార్డు అధికారి నల్లంటి వినోద్, తెలంగాణ ఏసీబీ అధికారులకు "రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇంటి మంజూరు దరఖాస్తులు ప్రాసెస్ చేయాలని" ఫిర్యాదుదారుడి వద్ద నుండి రూ.2,500/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించిన తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. Ch. కృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్, కాళ్లకల్ సర్కిల్ మరియు గ్రామం, మనోహరాబాద్ మండలం, మెదక్ జిల్లా, "63KVA 3-ఫేస్ DTR అండర్ LT కేటగిరీ III" ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా విడుదల చేయాడానికి  ఫిర్యాదుదారుడి నుండి 20,000/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ ACB అధికారులకు పట్టుబడ్డాడు. అసిస్టెంట్ ఇంజినీర్ మొదట్లో ఫిర్యాదిదారుని నుండి రూ..30,000/- లంచం డిమాండ్ చేశాడు, అందులో అతను ఇప్పటికే రూ.10,000/- తీసుకున్నాడు.. “అవినీతిని నివేదించడం కొరకు 1064కు డయల్ చేయండి” 

జనవరి 28న దేశవ్యాప్తంగా యుపిఎస్ పై నిరసనలకు పిలుపు నిచ్చిన సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ

Image
  జనవరి 28న దేశవ్యాప్తంగా యుపిఎస్ పై  నిరసనలకు పిలుపు -కేరళ క్విట్ ఎం పి ఎస్ మహా ర్యాలీలో ఎన్ఓపిఎస్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ పిలుపు ఈరోజు కేరళ రాష్ట్రంలో  కోజికోడ్ జిల్లా కేంద్రంలో ఎన్. ఎం.ఓ.పి.యెస్ సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో స్టేట్ ఎన్. పి.యెస్.ఎంప్లాయిస్ కలెక్టివ్  సమక్షంలో క్విట్ ఎన్. పి.ఎస్- నో యూ.పి.ఎస్ మహా ర్యాలీ జరిగింది.అనంతరం  స్టేడియం కార్నర్ నందు క్విట్ ఎన్. పి.యెస్. బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కేరళ ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ , జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన యూనిఫైడ్ పెన్షన్ విధానం నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 28న ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాలయాల్లో  యుపిఎస్ ప్రతుల దగ్ధం చేయాలని , దేశ వ్యాప్తంగా నిరసనలు వివిధ రూపాల్లో  తెలియజేయాలని పిలుపునిచ్చారు. కేరళ  లో మొదలైన నిరసనలు, ఫిబ్రవరి 7న కర్ణాటక బెంగళూరు కేంద్రంగా ఫ్రీడం పార్కు నందు యుపిఎస్ వద్దని ధర్నా చేపడుతున్నామని , మార్చి 2న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నందు చలో ధర్నా చౌక...

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Image
  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు   హైద్రాబాద్:  76వ రిపబ్లిక్ డే సందర్భంగా మెంబర్ సెక్రటరీ జి.రవి తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (టిజిపిసిబి) బోర్డు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26వ తేదీకి భారత రాజ్యాంగం మరింత ప్రాముఖ్యతనిస్తుంది. 1950లో ఈ చారిత్రాత్మక రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది అని కొనియాడారు. టిజిపిసిబి పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్యం నియంత్రణ కోసం పని చేస్తోంది అని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంతో, దేశభక్తితో పాల్గొన్నారు. ఉద్యోగులు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, హరిత తెలంగాణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.

రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా CI ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు*

Image
 *రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా CI ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు* *మిస్సింగ్ కేసులో నిందితుడి పేరును తొలగించేందుకు* *రూ 1.5 లక్షలు డిమాండ్ చేసిన షాహినాజ్ గంజ్ సీఐ బాలు చౌహన్* *రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా బాలు చౌహన్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు*

*ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం - జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి *

Image
*ఆడపిల్లలు చదువుకుంటే ఏదైనా సాధ్యం - జిల్లా కలెక్టరు ఇలా త్రిపాఠి * శుక్రవారం నాడు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో నల్లగొండ పట్టణం లోని క్లాక్ టవర్ వద్ద నుండి  విద్యార్దినుల మరియు మహిళలు తో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఉాపి ప్రారంభించారు. ఈ సందర్బంగా  బేటి బచావో బేటి పడావో పై ఏర్పాటుచేసిన పోస్టర్ ను విడుదల చేశారు. *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....* ఆడ పిల్లలను చదివించాలని, వారు చదువుకుంటే ఏదైనా సాధ్యమని అన్నారు. ప్రధానమంత్రి, ఉపాధ్యాయులు కావాలన్నా లక్ష్యాలను తేలికగా సాధించగలరని అన్నారు. ఆడపిల్లలు చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు. చదువు వలన కలిగే లాభాలను, ఎందుకోసం చదువుకోవాలి అనే విషయాల పట్ల కలెక్టరు విద్యార్ధులను అడిగి వారిలో ఆసక్తి కలిగించారు. 2015 నుండి ప్రారంభమైన జాతీయ బాలికా దినోత్సవం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున పాఠశాలలు,  కళాశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలలో మహిళలకు, విద్యార్థినులకు వచ్చే మార్చి 8 వ తేదీ వరకు భ్రూణ హత్యలను నివారించడం, బాలికా విద్యను పోత్సహించడం, మహిళా...

నల్లగొండలో అట్టహాసంగా జర్నలి స్టు క్రీడలు ప్రారంభం --ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి

Image
 నల్లగొండలో అట్టహాసంగా జర్నలి స్టు క్రీడలు ప్రారంభం  --ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ, జనవరి 24:: నల్లగొండ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడో త్సవాలను నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారం భించారు. రెండు రోజులపాటు వివిధ క్రీడాంశాల్లో నిర్వహించే ఆటల పోటీలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ లతో కలిసి ఆయన లాంచనంగా ప్రారం భించారు. పలు క్రీడాంశాల్లో పేర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీడి యో, ఫోటోగ్రాఫర్, డెస్క్ జర్నలిస్టు లు జర్నలిస్టులు ప్రారంభ కార్య క్ర మంలో పాల్గొన్నారు. క్రీడలను ప్రా రంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీని వాస్ రెడ్డి తదితర అతిధులు ఆ క్రీడాంశాలలో పాల్గొనడం ద్వారా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో జర్నలిస్...

కుక్కకాటు ,పాముకాటు పట్ల అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

Image
       కుక్కకాటు ,పాముకాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని, కుక్క,పాము కాటుకు గురైన వారికి వెంటనే వైద్యం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.          గురువారం ఆమె నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.     ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రికి సంబంధించిన వివిధ రిజిస్టర్లను తనిఖీ చేశారు .ఇటీవల కాలంలో కుక్కకాటు ,పాముకాట్లు ఎక్కువ అయ్యాయని, అలాంటివారికి తక్షణ వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పై ఉందని అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల ద్వారా ప్రసవాల సంఖ్యను పెంచాలని ,మరీ ముఖ్యంగా సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాత ,శిశు సంరక్షణ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని, మాత శిశు మరణాలు సంభవించకుండా చూడాలన్నారు. వైద్యులు, నర్సులు సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరుకావాలని, ముంద...

అనంత్ నకిరికంటి పుట్టినరోజు సందర్భముగా ఉచిత భోజనం అందజేత*

Image
 *అనంత్ నకిరికంటి పుట్టినరోజు సందర్భముగా ఉచిత భోజనం అందజేత*  *నకరికంటి అనంత్ తన ఆలోచనా శక్తితో చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు-మడుపల్లి రవి గుప్తా* *ఉచిత భోజనం అందచేయడం కేవలం వినూత్నమైనదే కాదు, పలువురి ఆకలి తీర్చే గొప్ప సేవగా నిలుస్తోంది- రామస్వామి* *సేవలకు చిరునామాగా నిలుస్తున్న విఠల్- కొత్త వెంకటేశ్వర్లు.* *జీవిత బీమా ఏజెంట్ గా అనంత్ నన్ను ఎంచుకోవడం నా అదృష్టం- కౌటికె విఠల్* హైదరాబాద్ జనవరి 23:   తన పాలసీదారుల పుట్టినరోజులను వినూత్నంగా జరపడం భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ కే ప్రత్యేకతగా నిలుస్తోంది. తన విలువైన పాలసీదారుడు అనంత్ నకరికంటి పుట్టినరోజు సందర్భంగా, కౌటికె విఠల్ మంగళవారం రోజున బసవతారకం ఆసుపత్రి వద్ద వెయ్యి మందికి ఉచితపంక్తి భోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి రోగుల కుటుంబ సభ్యులు, స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహార సేవలు అందించారు. కార్యక్రమము పగడ్బందీగా నిర్వహించబడగా, భోజనం చేసినవారు సంతోషంతో దీవెనలు అందించారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడుపల్లి రవి గుప్తా హాజరై, రిబ్బన్ కత్తిరించి కేక...

ఆధాబ్ హైద్రాబాద్ కేసులో నవీన్ మిట్టల్ ను నాంపల్లి కోర్టు పర్సనల్ కేపాసిటి లో హాజరు కమ్మింది - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ KN సాయికుమార్

Image
 ఆధాబ్ హైద్రాబాద్ కేసులో నవీన్ మిట్టల్ ను నాంపల్లి కోర్టు పర్సనల్ కేపాసిటి లో హాజరు కమ్మింది - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ KN సాయికుమార్   హైద్రాబాద్: ఆధాబ్ హైద్రాబాద్ పై IAS అధికారి పరువు నష్టం కేసులో ఆధాబ్ హైద్రాబాద్ తరపున ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ KN సాయికుమార్ నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. నవీన్ మిట్టల్ పర్సనల్ కెపాసిటీ లో కేసు వేశారని అందువల్ల ఆయన పర్సనల్ కెపాసిటీ లో కోర్టు హాజరు కావాలని సాయికుమార్ కోర్టుకు విన్నవించారు. కోర్టు వారు అడ్వకేటు వాదనలు పరిగణనలోకి తీసుకొని నవీన్ మిట్టల్ ను పర్సనల్గా హాజరుకమని కేసును ఏప్రిల్ 23 కు వాయిదా వేసింది

PCB ఉద్యోగుల సంఘం 2025 క్యాలెండర్‌ను విడుదల చేసిన మెంబర్ సెక్రెటరీ జి. రవి

Image
 PCB ఉద్యోగుల సంఘం 2025 క్యాలెండర్‌ను విడుదల చేసిన మెంబర్ సెక్రెటరీ జి. రవి హైద్రాబాద్: PCB ఉద్యోగుల సంఘం ప్రచురించిన 2025 క్యాలెండర్‌ను ప్రధాన కార్యాలయం, సనత్ నగర్ వద్ద అయన ఛాంబర్లో పీసీబీ మెంబర్ సెక్రెటరీ జి. రవి విడుదల బుధవారం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీవాత్సవ్, జనరల్ సెక్రటరీ కృపానంద్, చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి.రఘు నేతృత్వంలోని టీజీపీసీబీ ఉద్యోగులు, బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం సత్యనారాయణరావు, హనుమంత్ రెడ్డి, వినయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని దిల్ రాజు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు

Image
  హైదరాబాద్‌లోని దిల్ రాజు ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు హైదరాబాద్: హైదరాబాద్‌లోని సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయాలు, ఇళ్లతో పాటు ఆయన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మూలాల ప్రకారం, అతని బంధువుల నివాసాలతో సహా ఎనిమిది వేర్వేరు ప్రదేశాలలో దాడులు జరిగాయి. దిల్ రాజు, అయన అసలు పేరు వెలంకుచ వెంకట రమణా రెడ్డి, ప్రముఖ తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ను ఆయన సొంతం . తాజాగా ఆయనను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జనవరిలో దిల్ రాజు రెండు సినిమాలను నిర్మించాడు. పాన్-ఇండియన్ చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద తక్కువ పనితీరు కనబరిచింది, అతని మరొక విడుదల, సంక్రాంతికి వస్తున్నం, RRR-యేతర రికార్డులను బద్దలు కొట్టి, గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో హైదరాబాద్‌‌లో పలుచోట్ల ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌, జూబ్లీ హిల్స్‌, కొండాపూర్‌, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసా...

భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్

Image
 భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ హైద్రాబాద్: భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి కాలెండర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో భూపతి టైమ్స్ & గూఢచారి, ది పబ్లిక్ టివి ఎడిటర్ & పబ్లిషర్ భూపతి రాజు వున్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ వాస్తవాలను నిర్భయంగా ప్రచురిస్తూ, వార్తలను అతి వేగంగా అందిస్తున్నారని అభినందించారు

తెలంగాణ రాజక వృత్తి దారుల సమాఖ్య కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్

Image
 తెలంగాణ రాజక వృత్తి దారుల సమాఖ్య కాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ హైద్రాబాద్: తెలంగాణ రాజక వృత్తి దారుల సమాఖ్య కాలెండర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో చైర్మన్, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ కార్యక్రమంలో ఆ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ మరియు నిరంజన్, సహదేవ్, మల్లేష్, శ్రీనివాస్, సైదా రావు, వినాయకుమార్ పాల్గొన్నారు.

ఏసీబీ నెట్ లో ఇద్దరు

Image
ఏసీబీ నెట్ లో ఇద్దరు ఏసీబీ నెట్ లో ప్రభుత్వ ఈ.ఎన్.టి. ఆసుపత్రి, కోటి, హైదరాబాద్ సీనియర్ అసిస్టెంట్. 17.01.2025న 13.30 గంటలకు, . ఆర్. సంతోష్ తివారీ, సీనియర్ అసిస్టెంట్, ఈ.ఎన్.టి. ప్రభుత్వ ఆసుపత్రి, కోటి, హైదరాబాద్, అధికారిక అనుకూలత కోసం ఫిర్యాదుదారుడి నుంచి రూ. 3,000/- లక్ష్యంగా లంచం డిమాండ్ చేసి, స్వీకరించినప్పుడు హైదరాబాద్ నగర యూనిట్-1 ద్వారా ఏసీబీ చేత పట్టుబడ్డాడు. ప్రారంభంలో రూ. 20,000 లంచంగా కోరాడు మరియు ఇప్పటికే రూ. 17,000 స్వీకరించాడు. ఆ నిందిత అధికారికి ప్రజా విధిని అసమర్థంగా మరియు అహంకారంగా నిర్వహించాడు. కార్యాలయంలోని కుడి వైపు డెస్క్ రసాయన పరీక్షలో సానుకూల ఫలితం ఇచ్చింది.    ఆర్. సంతోష్ తివారీ, యూడీసీ, ఈ.ఎన్.టి. ప్రభుత్వ ఆసుపత్రి, కోటి, హైదరాబాద్ ను అరెస్ట్ చేసి, నాంపల్లి, హైదరాబాద్ లోని గౌరవనీయ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు ఉంచారు. కేసు దర్యాప్తులో ఉంది. ********************************************** ACB నెట్‌లో నల్గొండ జిల్లా డిండి (గుండ్లపల్లి) మండలం, తహసీల్దార్ కార్యాలయం, అదనపు రెవిన్యూ ఇన్స్పెక్టర్ 17.01.2025న, నిందిత అధికారికుడు (A.O.) నెనవత్ శ్య...

*EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్లో పొలిటికల్ వార్*

Image
 *EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్లో పొలిటికల్ వార్* _*MP భోపాల్లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి.*_ _*పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్నాథ్ సర్కార్ కరప్షను మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.*_ _

కష్టం మిల్లింగ్ రైస్ ను సకాలంలో ఇవ్వని మిల్లర్లపై చర్యలు & బ్లాక్ లిస్టులో ఉంచుతాం - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్

Image
 కష్టం మిల్లింగ్ రైస్ ను సకాలంలో ఇవ్వని మిల్లర్లపై చర్యలు & బ్లాక్ లిస్టులో ఉంచుతాం - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్  నల్గొండ:        కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) ను సకాలంలో చెల్లించడంలో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా, అలాంటి మిల్లులను బ్లాక్ లిస్టులో ఉంచడం జరుగుతుందని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. గురువారం అయన తన చాంబర్ లో రైస్ మిల్లర్లతో 2024 -25 ఖరీఫ్ ,రబీ సీఎంఆర్ పై సమీక్షించారు.      రబీ సీఎంఆర్ ను ఈనెల 25 లోగా నూటికి నూరు శాతం చెల్లించాలని చెప్పారు. మిల్లర్లకు రబీలో 3 లక్షల 26 వేల 99 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగిందని, ఇందుకుగాను మిల్లర్లు 2 లక్షల 21 వేల 747 మెట్రిక్ టన్నుల సి ఎం ఆర్ చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2 లక్షల 1892 మెట్రిక్ టన్నులు మాత్రమే చెల్లించారని, తక్కిన 19856 మెట్రిక్ టన్నులను ఈనెల 25 లోపు చెల్లించాలని ఆదేశించారు .జిల్లాలో రబి సి ఎం ఆర్ మొత్తం 91 శాతాన్ని చెల్లించడం జరిగిందని తెలిపారు.    2024-25 ఖరీఫ్ సీఎంఆర్ రైస్ మిల్లర్లు అందరూ నిర్దేశించిన సమయంలో గ...

ACB వలలో సబ్-రిజిస్ట్రార్

Image
 ACB వలలో సబ్-రిజిస్ట్రార్ జగిత్యాల, ( గూఢచారి): జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఎస్‌ఆర్‌ఓ కార్యాలయంలో సబ్-రిజిస్ట్రార్ ఎండీ అసిఫుద్దీన్ మరియు ఆఫీస్ సబార్డినేట్ (అవుట్ సోర్సింగ్) బానోత్ రవి కుమార్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ఆర్మూర్ రవి, ద్వారా రూ. 5,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినందుకు ACB అధికారులు పట్టుకున్నారు. మెట్‌పల్లికి చెందిన ఫిర్యాదుదారుకు సంబంధించిన "ఒరిజినల్ సేల్ డీడ్‌ను మరియు మరియు  మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్‌ల అప్పగించినందుకు లంచం డిమాండ్ చేసి స్వీకరించారు.

ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుండి తొలగించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Image
 ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుండి తొలగించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   Nalgonda: (Gudachari ) : అనధికారికంగా విధులకు గైహాజరైనందుకుగాను నల్గొండ జిల్లా, గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తాన్ని ఉద్యోగాల నుండి తొలగించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి .      ముందస్తు అనుమతి లేకుండా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తానికి మొత్తం విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అందరిని ఉద్యోగం నుంచి తొలగించడం , రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది.      బుధవారం ఆమె గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.       జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా ఎవరు విధులలో లేరు అందరూ విధులకు గైర్హాజరయ్యారు .ప్రభుత్వం బుధవారం ఎలాంటి సెలవును ప్రకటించనప్పటికీ బాధ్యత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మొత్తం ము...

2వేలు లంచం తో ఏసీబీ కి చిక్కిన హెడ్ మాస్టర్

Image
 2వేలు లంచం తో ఏసీబీ కి చిక్కిన హెడ్ మాస్టర్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్, యెల్లండు, భద్రాద్రి కోతగూడెం జిల్లా ప్రధానోపాధ్యాయుడు/హెడ్ మాస్టర్ ACB కి చెక్కారు. 09.01.2025న, సుమారు 09.33 గంటలకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి భీమనపల్లి కృష్ణ, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్, యెల్లండు, భద్రాద్రి కోతగూడెం జిల్లా ప్రధానోపాధ్యాయుడు, ACB, ఖమ్మం యూనిట్ ద్వారా, ఆయన డిమాండ్ చేసిన రూ. 2,000/- లంచం మొత్తాన్ని ఫిర్యాదుదారు ద్వారా A-2 కోట్చెర్ల రామ కృష్ణ, అటెండర్ (ఔట్ సోర్సింగ్) వద్ద స్వీకరించినప్పుడు పట్టుబడ్డారు. AO-1 ఫిర్యాదుదారుడిని, డిమాండ్ చేసిన లంచం మొత్తం చెల్లించకపోతే, తన జీత బిల్లులను సంబంధిత అధికారులకు సమర్పించమని బెదిరించారు. A2 యొక్క కుడి చేతి వేళ్లపై మరియు కుడి జేబు వెనుక భాగంలోని అంతర్గత ఫ్లాప్‌పై నిర్వహించిన రసాయన పరీక్షలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. A-2 వద్ద నుండి రూ. 2,000/- లంచం మొత్తం పునరుద్ధరించబడింది. భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుడి వివరాలు రహస్యంగా ఉంచబడుతున్నాయి. అందువల్ల, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి-1, భీమనపల్లి కృష్ణ, తెలంగాణ మైనారిటీ రెసి...

ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని FIR చేయని పోలీసులు- FIR కి డిమాండ్ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్

Image
ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని FIR చేయని పోలీసులు-  FIR కి డిమాండ్ చేసిన  ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఆవుల తో ఉన్న వాహనాన్ని పట్టుకొని సంబధిత పోలీసులు FIR చేయకుండా నిర్లక్ష్యం చేయడం తో ప్రముఖ హై కోర్టు అడ్వకేట్ సాయి కుమార్ FIR చేయాలని డిమాండ్ చేసి చేయించారు.    

ACB కలకలం - పీడీఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్

Image
ACB కలకలం - పీడీఎస్ రైస్ వ్యాపారిని డబ్బు డిమాండ్ • కొంత డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు • విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ACB కలకలం ఏసీబీ అదుపులో ఓ పోలీసు అధికారి తొర్రూరు, గూఢచారి: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఓ పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం దంతాలపల్లి వద్ద అధికారులు రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఆదిలాబాద్ కు చెందిన ఓ నిందితుడి నుంచి పోలీసు అధికారి రూ.4లక్షలు డిమాండ్ చేసి రూ.2లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగతా డబ్బు కోసం తనకు కాల్ చేస్తుండటంతో నిందితుడు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తుంది. తొర్రూర్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఒక పోలీస్ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించిం ది.

ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు*

Image
 *ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు* యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ ప్రీమియర్ ఎక్ ప్లోజీవ్స్ కంపెనీలో జరిగిన పేలుడు సంఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య మృతిచెందగా, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు గాయాలయ్యాయి. ప్రకాష్ కు భువనగిరి ఏరియా హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరి కొంత మంది కార్మికులు కూడా గాయపడగా వారిని కూడా హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించినట్లు తెలుస్తుంది.