జనవరి 28న దేశవ్యాప్తంగా యుపిఎస్ పై నిరసనలకు పిలుపు నిచ్చిన సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ


 


జనవరి 28న దేశవ్యాప్తంగా యుపిఎస్ పై  నిరసనలకు పిలుపు
-కేరళ క్విట్ ఎం పి ఎస్ మహా ర్యాలీలో ఎన్ఓపిఎస్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ పిలుపు

ఈరోజు కేరళ రాష్ట్రంలో  కోజికోడ్ జిల్లా కేంద్రంలో ఎన్. ఎం.ఓ.పి.యెస్ సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో స్టేట్ ఎన్. పి.యెస్.ఎంప్లాయిస్ కలెక్టివ్  సమక్షంలో క్విట్ ఎన్. పి.ఎస్- నో యూ.పి.ఎస్ మహా ర్యాలీ జరిగింది.అనంతరం  స్టేడియం కార్నర్ నందు క్విట్ ఎన్. పి.యెస్. బహిరంగ సభ జరిగింది.

ఈ సభకు కేరళ ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ , జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన యూనిఫైడ్ పెన్షన్ విధానం నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 28న ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాలయాల్లో  యుపిఎస్ ప్రతుల దగ్ధం చేయాలని , దేశ వ్యాప్తంగా నిరసనలు వివిధ రూపాల్లో  తెలియజేయాలని పిలుపునిచ్చారు. కేరళ  లో మొదలైన నిరసనలు, ఫిబ్రవరి 7న కర్ణాటక బెంగళూరు కేంద్రంగా ఫ్రీడం పార్కు నందు యుపిఎస్ వద్దని ధర్నా చేపడుతున్నామని , మార్చి 2న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నందు చలో ధర్నా చౌక్ పేరిట నిరసన కార్యక్రమాలు కు పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాద్యాయులు భారీ సంఖ్యలో హాజరై నిరసన లు తెలపాలన్నారు.

ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఇప్పటికే రెండు దశాబ్దాలుగా సి.పి.ఎస్ ఉద్యోగులని గందరగోళపరిచిందని,  ఇప్పుడు కేంద్రం యూపీఎస్ ను తెరపైకి తెచ్చి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఉద్యోగ , ఉపాధ్యాయులకు కంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వమే పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. 

ఓ పి ఎస్ అనేది ఉద్యోగుల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పదవి విరమణ తర్వాత  ఖచ్చితమైన పెన్షన్, పిఎఫ్ ,గ్రాట్యుటీ కల్పించే ట్రిపుల్ బెనిఫిట్ స్కీం అని, సి.పి.ఎస్ /యు పి ఎస్ లో  ఉద్యోగి సర్వీస్ లో ఉన్నన్ని రోజులు కాంట్రిబ్యూషన్లను ఇస్తే, దాన్ని మొత్తం షేర్ మార్కెట్లో పెట్టి, పెన్షన్ నిర్ణయిస్తారు.అంటే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం షేర్ మార్కెట్ కు నిరంతరాయంగా నిధులను సమకూర్చడమే ఈ సీపీఎస్/ యుపిఎస్ ల ముఖ్యోద్దేశ్యామన్నారు. ఈ యూ.పి.ఎస్ విధానంలో అదనంగా చేర్చినటువంటి 8.5% ప్రభుత్వ వాటా మరింతగా పెట్టుబడులను షేర్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించడమైంది గాని ఉద్యోగి కుటుంబం బాగును దృష్టిలో పెట్టుకోలేదని అన్నారు.

రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన సి.పీ. ఎస్ అత్యంత లోపం నిష్ప్రయోజనకరమైనదని కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందని, ఇది ఏ రకంగా చూసిన ఉద్యోగి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్త లేదన్నారు. 

నూతన పెన్షన్ విధానం పై వేసిన టీవీ సోమనాథన్ కమిటీ సి.పీ.ఎస్ లో రిటైర్మెంట్ అయిన,సర్వీస్ లో  చనిపోయిన ఉద్యోగి కుటుంబ సభ్యుల వాస్తవ పరిస్థితులను తెలుసుకొని రిపోర్టు ఇచ్చాడా ?? లేదా అని ,ఆర్టిఐ ద్వారా కమిటీ రిపోర్ట్ ను అడిగితే, బహిర్గత పరచలేమునే సమాధానం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చిందని తెలిపారు.ఈ సభలో కేరళ సిపిఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ రఫీక్, ప్రధాన కార్యదర్శి షాజీవ్, రాష్ట్ర నాయకులు లాజర్ తెలంగాణ నుండి సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్,కోశాధికారి నరేష్ గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!