తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
హైద్రాబాద్:
76వ రిపబ్లిక్ డే సందర్భంగా మెంబర్ సెక్రటరీ జి.రవి తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (టిజిపిసిబి) బోర్డు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26వ తేదీకి భారత రాజ్యాంగం మరింత ప్రాముఖ్యతనిస్తుంది. 1950లో ఈ చారిత్రాత్మక రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది అని కొనియాడారు. టిజిపిసిబి పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్యం నియంత్రణ కోసం పని చేస్తోంది అని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో ఉత్సాహంతో, దేశభక్తితో పాల్గొన్నారు. ఉద్యోగులు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, హరిత తెలంగాణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.
Comments
Post a Comment