కష్టం మిల్లింగ్ రైస్ ను సకాలంలో ఇవ్వని మిల్లర్లపై చర్యలు & బ్లాక్ లిస్టులో ఉంచుతాం - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
కష్టం మిల్లింగ్ రైస్ ను సకాలంలో ఇవ్వని మిల్లర్లపై చర్యలు & బ్లాక్ లిస్టులో ఉంచుతాం - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
నల్గొండ:
కష్టం మిల్లింగ్ రైస్ (సి ఎం ఆర్) ను సకాలంలో చెల్లించడంలో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా, అలాంటి మిల్లులను బ్లాక్ లిస్టులో ఉంచడం జరుగుతుందని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. గురువారం అయన తన చాంబర్ లో రైస్ మిల్లర్లతో 2024 -25 ఖరీఫ్ ,రబీ సీఎంఆర్ పై సమీక్షించారు.
రబీ సీఎంఆర్ ను ఈనెల 25 లోగా నూటికి నూరు శాతం చెల్లించాలని చెప్పారు. మిల్లర్లకు రబీలో 3 లక్షల 26 వేల 99 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగిందని, ఇందుకుగాను మిల్లర్లు 2 లక్షల 21 వేల 747 మెట్రిక్ టన్నుల సి ఎం ఆర్ చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 2 లక్షల 1892 మెట్రిక్ టన్నులు మాత్రమే చెల్లించారని, తక్కిన 19856 మెట్రిక్ టన్నులను ఈనెల 25 లోపు చెల్లించాలని ఆదేశించారు .జిల్లాలో రబి సి ఎం ఆర్ మొత్తం 91 శాతాన్ని చెల్లించడం జరిగిందని తెలిపారు.
2024-25 ఖరీఫ్ సీఎంఆర్ రైస్ మిల్లర్లు అందరూ నిర్దేశించిన సమయంలో గా చెల్లించాలని ఆయన ఆదేశించారు.
సీఎంఆర్ చెల్లింపులో వైఫల్యం చెందిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడమే కాకుండా, అలాంటి మిల్లులను బ్లాక్లిస్టులో ఉంచడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సమావేశానికి జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు ,తదితరులు హాజరయ్యారు.
Comments
Post a Comment