అనంత్ నకిరికంటి పుట్టినరోజు సందర్భముగా ఉచిత భోజనం అందజేత*


 *అనంత్ నకిరికంటి పుట్టినరోజు సందర్భముగా ఉచిత భోజనం అందజేత* 


*నకరికంటి అనంత్ తన ఆలోచనా శక్తితో చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు-మడుపల్లి రవి గుప్తా*


*ఉచిత భోజనం అందచేయడం కేవలం వినూత్నమైనదే కాదు, పలువురి ఆకలి తీర్చే గొప్ప సేవగా నిలుస్తోంది- రామస్వామి*


*సేవలకు చిరునామాగా నిలుస్తున్న విఠల్- కొత్త వెంకటేశ్వర్లు.*


*జీవిత బీమా ఏజెంట్ గా అనంత్ నన్ను ఎంచుకోవడం నా అదృష్టం- కౌటికె విఠల్*


హైదరాబాద్ జనవరి 23:  

తన పాలసీదారుల పుట్టినరోజులను వినూత్నంగా జరపడం భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ కే ప్రత్యేకతగా నిలుస్తోంది.


తన విలువైన పాలసీదారుడు అనంత్ నకరికంటి పుట్టినరోజు సందర్భంగా, కౌటికె విఠల్ మంగళవారం రోజున బసవతారకం ఆసుపత్రి వద్ద వెయ్యి మందికి ఉచితపంక్తి భోజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి రోగుల కుటుంబ సభ్యులు, స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహార సేవలు అందించారు. కార్యక్రమము పగడ్బందీగా నిర్వహించబడగా, భోజనం చేసినవారు సంతోషంతో దీవెనలు అందించారు.


ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడుపల్లి రవి గుప్తా హాజరై, రిబ్బన్ కత్తిరించి కేక్ కోసి కార్యక్రమము ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,“ఇప్పటివరకు వ్యాపారంలో ఖాతాదారులకు విలువనిచ్చే దృక్పథం చూశాం కానీ జీవిత బీమా రంగంలో ఒక చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ తన పాలసీదారుల పుట్టినరోజును ఇలా ప్రజలకు ఆహార దానం రూపంలో జరపడం ఎంతో వినూత్నమైన విషయం. ఇది వినటమే కాక, చూడడం కూడా చాలా స్ఫూర్తిదాయకం,” అని అన్నారు


ఈ సందర్భంగా కౌటికె విఠల్ మాట్లాడుతూ,“ అనంత్ తన ఆలోచనా శక్తితో చిన్న వయసులోనే గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆయన యువతకు ఆదర్శప్రాయుడు, వారి వ్యాపార దృక్పథం ఎంతో ప్రత్యేకమైనది. జీవిత బీమా ఏజెంట్ గా ఆయన నన్ను ఎంచుకోవడం నా అదృష్టం,” విఠల్ పేర్కొన్నారు.

నా విలువైన ప్రతి పాలసీదారుడి పుట్టినరోజు ఇదే విధంగా వెయ్యి మందికి భోజనాలు అందించి, వారి ఆరోగ్య సుఖాలను కోరుతూ సేవలు అందించడమే నా లక్ష్యం అని, భోజనం చేసిన వారు వారి దీవెనలు తప్పకుండా అందిస్తారు,” అని అన్నారు.


సికింద్రాబాద్ డివిజన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ,

“గత 35 ఏళ్లుగా జీవిత బీమా రంగంలో పనిచేస్తున్నప్పటికీ, ఇలాంటి సేవా కార్యక్రమం ఎక్కడా చూడలేదు. ఇది కేవలం వినూత్నమైనదే కాదు, పలువురి ఆకలి తీర్చే గొప్ప సేవగా నిలుస్తోంది,” అని ప్రశంసించారు.


ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి కొత్త వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,

“సేవలకు చిరునామాగా నిలిచిన విఠల్ కరోనా సమయంలోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు పాలసీదారుల పుట్టినరోజులను ఇలా పేదలకు భోజనం అందించడం ద్వారా వారి సంతోషానికి మరింత విలువను జోడిస్తున్నారు. ఈ విధంగా భోజనం చేసిన వారు ఇచ్చే దీవెనల ద్వారా విఠల్ పాలసీదారులకు వంద సంవత్సరాల ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమం వినూత్నతకు నిదర్శనంగా నిలిచి, పాలసీదారుల పట్ల కౌటికె విఠల్ స్ఫూర్తిదాయక సేవను అందరికి చాటిచెప్పింది. వెయ్యి మందికి అందించిన ఈ భోజన సమర్పణ సర్వత్ర ప్రశంసలు అందుకుంది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!