నల్లగొండలో అట్టహాసంగా జర్నలి స్టు క్రీడలు ప్రారంభం --ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండలో అట్టహాసంగా జర్నలి స్టు క్రీడలు ప్రారంభం
--ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ, జనవరి 24:: నల్లగొండ జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల క్రీడో త్సవాలను నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారం భించారు. రెండు రోజులపాటు వివిధ క్రీడాంశాల్లో నిర్వహించే ఆటల పోటీలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ లతో కలిసి ఆయన లాంచనంగా ప్రారం భించారు. పలు క్రీడాంశాల్లో పేర్లు పెద్ద ఎత్తున నమోదు చేసుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీడి యో, ఫోటోగ్రాఫర్, డెస్క్ జర్నలిస్టు లు జర్నలిస్టులు ప్రారంభ కార్య క్ర మంలో పాల్గొన్నారు. క్రీడలను ప్రా రంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీని వాస్ రెడ్డి తదితర అతిధులు ఆ క్రీడాంశాలలో పాల్గొనడం ద్వారా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరిం చుకొని నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వ ర్యంలో జర్నలిస్టులకు క్రీడా పోటీ లు నిర్వహించడం అభినందనీ యమన్నారు. ప్రతినిత్యం వృత్తిరీత్యా ఒత్తిడిలో మునిగితేలే జర్నలిస్టులకు అడపాదడపా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా ఉల్లాసాన్ని కలిగించి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలు మానసి కోలాసానికి కాకుండా దేహ దారుధ్యాన్ని కూడా ఉపకరించే అవకాశం ఉన్నందున నల్గొండ ప్రెస్ క్లబ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు తామంతా సానుకూల ధోరణితో ఉన్నట్లు, త్వరలోనే అర్హత కలిగిన జర్నలి స్టులందరికీ నల్లగొండ పట్టణంలో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ పట్టణ కాంగ్రె స్ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ జర్నలిస్టులకు నల్గొం డ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడ లు నిర్వహించడం ఎంతో అభినం దనీయమని వ్యాఖ్యానించారు. జర్నలిజంలో వివిధ రంగాలలో పనిచేసే జర్నలి స్టులందరూ ఈ క్రీడా పోటీల ద్వా రా ఐక్యమత్యం చాటువచ్చని ఆ క్రమంలోనే జర్న లిస్టుల మధ్య సహ జంగా ఉండే చిన్నచిన్న పొరపొచ్చాల వంటివి సమసిపోయే అవకాశం ఉంటుం దని వివరించారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టులంతా ఐకమత్యం గా ఉండి ఇంటి స్థలాలు సాధించు కోవాలని అందుకు తమంత సం పూర్ణమైన సహకారం అందిస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో నల్లగొండలో ప్రెస్ క్లబ్ కోసం ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో తాత్కాలిక భవనం సమకూర్చడం జరిగిందని, అతి త్వరలో శాశ్వత భవనo కూడా నల్లగొండ ప్రెస్ క్లబ్ సమకూర్చేందుకు తమవంతు ప్రయత్నం కొనసాగిస్తామని, అందు కు జర్నలిస్టులంతా ఐక్యమత్యంతో కొనసాగాల్సిన అవశ్యకత ఉందని సూచించారు. అంతకుముందు నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్య దర్శులు పులి మామిడి మహేందర్ రెడ్డి, గాదే రమేష్ లు మాట్లాడు తూ నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యం లో క్రీడలు ప్రారంభించేందుకు విచ్చే సిన అతిధులకు కృతజ్ఞతలు తెలి యజేశారు. నల్లగొండ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏర్పడిన 24 గంటల్లోనే తాత్కాలిక భవనంతో పాటు ఫర్ని చర్ కూడా సమకూర్చిన మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గు మ్ముల మోహన్ రెడ్డిలకు జర్న లిస్టుల తరఫున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే జర్నలిస్టుల కు హామీ ఇచ్చినందున నల్లగొండ ప్రెస్ క్లబ్ శాశ్వత భవ నంతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాల విష యంలో సాధ్య మైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్య క్రమంలో ఇంచార్జ్ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కుంభం నర్సిరెడ్డి, నల్ల గొండ జిల్లా జర్నలిస్ట్ యూని యన్ అధ్యక్షుడు, నల్లగొండ ప్రెస్ క్లబ్ సలహాదారు గుండగోని జయ శంకర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు, నల్లగొండ ప్రెస్ క్లబ్ సలహాదారు ఫహీమోద్దీన్, మహిళా ప్రతినిధి మేకల వరుణమ్మ, నల్లగొండ ప్రెస్ క్లబ్ కోశాధికారి దండంపల్లి రవికు మార్, క్రీడల కన్వీనర్ మధు, ఎల క్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంక టరెడ్డి, సల్వాది జానయ్య, వీడి యో జర్నలిస్ట్ అసోసియేషన్ అ ధ్యక్ష, కార్య దర్శులు అల్లి మల్లేశ్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నాయకు లు కుశలవాచారి, సలీం, మధు, వినోద్, జానీ, కత్తుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment