తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్
తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ను విడుదల చేశారు.
ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 27న పోలింగ్.
మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది.
Comments
Post a Comment