కుక్కకాటు ,పాముకాటు పట్ల అప్రమత్తంగా ఉండాలి - జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
కుక్కకాటు ,పాముకాటు పట్ల అప్రమత్తంగా ఉండాలని, కుక్క,పాము కాటుకు గురైన వారికి వెంటనే వైద్యం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
గురువారం ఆమె నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆస్పత్రికి సంబంధించిన వివిధ రిజిస్టర్లను తనిఖీ చేశారు .ఇటీవల కాలంలో కుక్కకాటు ,పాముకాట్లు ఎక్కువ అయ్యాయని, అలాంటివారికి తక్షణ వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల పై ఉందని అన్నారు. ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల ద్వారా ప్రసవాల సంఖ్యను పెంచాలని ,మరీ ముఖ్యంగా సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాత ,శిశు సంరక్షణ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని, మాత శిశు మరణాలు సంభవించకుండా చూడాలన్నారు. వైద్యులు, నర్సులు సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరుకావాలని, ముందస్తు అనుమతి లేకుండా ఎవరు గైర్హాజరవ్వవద్దని, ఒకవేళ గైరు హాజరైనట్లయితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని సౌకర్యాలను తదితరులను పరిశీలించారు.
Comments
Post a Comment