వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 3 నుండి 10 వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని ,ఈనెల 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ,ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ వివరించారు . ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు తాను రిటర్నింగ్ అధికారిగా, నల్గొండ రెవిన్యూ అదనపు కలెక్టర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నట్ల...