మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!


 మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు!

నామినేషన్ ఫీజ్ లక్ష!

.




హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ  అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించినట్లు వైరల్ అవుతుంది. ఆ షెడ్యూల్ లో ఉన్న వివరాలు

చదవండి

17-2-2025 సోమవారం ఉ. 10:00 నుండి మ. 3:00 గం.ల వరకు వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట. 4:00గం.లకు స్క్యూటిని సా. 5:00 గం.లకు జాబితా ప్రకటన. 18-2-2025 మంగళవారం ఉ. 10:00 నుండి సా, 4:00గం.ల వరకు ఉపసంహరణలు.సా. 5:00 గం.లకు నిఖర జాబితా ప్రకటన. ఈ ప్రక్రియ హైదరాబాద్. : వైశ్య భవన్, చింతలబస్తీ, ఖైరతాబాద్, లో జరుగుతుంది. 4-2025 మంగళవారం రోజున ఉ. 9:00 నుండి సా. 5:00 గం. వరకు ఎన్నికల పోలింగ్. సా. 6:00 గం.లకు కౌంటింగ్ - అనంతరం ఫలితాల ప్రకటన. వాసవీ కళ్యాణ మండపము, వాసవీ సేవా కేంద్రము నందు పోలింగ్ జరుగును. 1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడును. 3) ఓటు వేయడానికి వచ్చే జనరల్ కౌన్సిల్ సభ్యులందరూ విధిగా తమ ఆధార్ కార్డు గాని, పాన్ కార్డు గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాస్ పోర్ట్ గాని ఒరిజినల్ ప్రూఫ్ను తీసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకోగలరు. అని షెడ్యూల్ లో ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ ప్రకటించినట్లు ఉన్నది. 

2వ పేజీలో ఉన్న వివరాలు : రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేయుటకు అర్హతలు:

1) 5 సంవత్సరముల నుండి మహాసభ జీవిత సభ్యునిగా ఉండవలెను.

2) జిల్లా మహాసభ అధ్యక్షునిగా రెండు సంవత్సరములు పని చేసి ఉండవలెను.

3) ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) లో మరియు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) లో పదవులు నిర్వహించిన, నిర్వహిస్తున్న వారు పోటీకి అనర్హులు.

4) మహాసభ నుండి సస్పెండ్ కాబడిన వారు పోటీకి అనర్హులు.

5) నాన్ రిఫండబుల్ నామినేషన్ ఫీజు రూ. 1,00,000/- చెల్లించి నామినేషన్ ఫారములు తీసుకొనవలెను.

6) నీతి బాహ్యమైన నడవడిక కలవారు, చట్టవిరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొని క్రిమినల్ కేసులలో ఆరు మాసములకు తగ్గకుండా జైలు శిక్ష విధింపబడిన వారు మరియు కోర్టులో ఇన్స్టాల్వెంట్గా ప్రకటించమని పిటిషన్ దాఖలు చేసి పెండింగ్ లో ఉన్న వారు, ఇన్స్టాల్వెంట్ గా కోర్టు చేత నిర్ణయింపబడిన వారు మరియు ఇన్సాల్వెంట్గా విముక్తి పొందని వారు (అన్ డిశ్చార్జ్ డ్ ఇన్స్టాల్వెంట్) మరియు మతి స్థిమితము లేనివారిగా కోర్టు నిర్ణయింపబడిన వారు పోటీకి అనర్హులు.

ఈ ఎన్నికల షెడ్యూల్ పై ఎన్నికల అధికారితో మా ప్రతినిధి వివరల కొరకు సంప్రదించగా షెడ్యూల్ ప్రకటించి నట్లు న్యూస్ పేపర్ల లో కూడ వస్తుందని చెప్పారు.   మహాసభ బైల చదివి తరువాత నోటిఫికేషన్ ఇచ్చారా? నియమ నిభందనలు బైలాలో ఉన్నవే  షెడ్యూల్ లో ప్రకటించారా అన్న ప్రశ్నలకు రేపు వివరాలు ఇవ్వగలనని మీటింగ్ లో ఉన్న అని బదులు ఇచ్చారు.

ఈ షెడ్యూల్  బైలా ప్రకారం లేదని కొందరు ఆర్యవైశ్య నాయకులు విమర్శిస్తున్నారు.  ఎన్నికలు జరపాలని ఉద్దేశ్యం లేక కావాలనే ఈ విధంగా ప్రకటన చేసారని, ఎన్నికలు సక్రమంగా జరపాలని డిమాండ్ చేస్తున్నారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్