ACB కి పట్టుబడ్డ GHMC బిల్ కలెక్టర్
HYD: ACB రైడ్స్ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ హైదరాబాద్లో ACB అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. సోమవారం GHMC రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రైడ్స్ చేశారు. ACB వివరాలు.. బిల్ కలెక్టర్ మధు ఓ పరిశ్రమకు సంబంధించి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు రూ. లక్ష డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ అసిస్టెంట్ రమేశ్ ద్వారా రూ. 45,000 తీసుకుంటూ మధు పట్టుబడ్డాడు. అధికారులు దర్యాప్తు చేపట్టారు. లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని ACB సూచించింది.
Comments
Post a Comment