శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు





 


శ్యాంసుందర్ కే నల్లగొండ ఆర్యవైశ్యుల మద్దతు








నల్లగొండ ( గూఢచారి) : తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్య కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ కు నల్గొండ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగళవారం నల్గొండ కు మద్దతు కోరుతూ వచ్చిన సందర్భంగా స్థానిక వాసవి భవన్ లో  సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా   రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన, మార్పు కోసం రాబోయే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు  జిల్లా ఆర్య వైశ్యులతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కలిసి మద్దతు కోరారు. దీనికి ప్రతిస్పందనగా, నాయకులు, కౌన్సిల్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ, రాష్ట్ర మహాసభలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, బైలాను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర మహాసభలో మెరుగైన పరిపాలన కోసం మార్పు అవసరమన్నారు. ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాంసుందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం, మెరుగైన ఆరోగ్య, విద్యా అవకాశాల కోసం తన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మహాసభ అధ్యక్షునిగా పోటీ చేయడంలో తన ఉద్దేశం సమాజ సేవేనని, ఆర్యవైశ్య సమాజానికి శ్రేయస్సు తేవడమే ధ్యేయమని చెప్పారు. మహాసభలో బాధ్యతాయుతమైన నాయకత్వం అందించేందుకు అందరి మద్దతు అవసరమని, సమాజంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అధ్యక్షుడు  యామా మురళీ, జిల్లా మాజీ  ప్రధాన కార్యదర్శులు కోటగిరి దైవదీనం, వీరెల్లి  కృష్ణయ్య, వనమా మనోహర్, సీనియర్ జర్నలిస్టులు భూపతి రాజు, కోటగిరి చంద్రశేఖర్, శ్రీ రామకోటి స్తూప దేవాలయం  చైర్మన్ ఓరుగంటి పరమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వందనపు వేణు , నల్లగొండ శ్రీనివాస్, నల్లగొండ అశోక్, ఓం ప్రసాద్, మిర్యాల మహేష్, వనమా రమేష్, భాస్కర్, నీలా వెంకన్న, అత్తెం భిక్షం,  గజావెల్లి సత్తయ్య,   కోటగిరి రాంబాబు, బండారు వెంకన్న, చెరుకు జానయ్య, శీల  సంతోష్, పల్లెర్ల సాయి,  జిల్లా ఆర్య వైశ్యులు మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!