ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?



 ఆర్యవైశ్య మహాసభ

 ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

*ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ ల్లో మిడిదుడ్డికి*
*ఉమ్మడి రంగారెడ్డి లో అమరవాదికి ఎడ్జ్*
*హైద్రాబాద్ లో ఉన్న బస్తీ సంఘాలు అమరవాది పై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారమ్*
* ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం మెదక్ లో 50:50*


హైద్రాబాద్ ( గూఢచారి): తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు భారీ యెత్తున జరగడం ఇది మొదటిసారి. తెలంగాణ వచ్చిన 11సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతున్నదున సహజంగానే ఆర్యవైశ్య కమ్యూనిటీ దృష్టి మొత్తం ఈ ఎన్నికలపై ఉన్నది. గత 11 సంవత్సరాల నుండి అధ్యక్షుడుగా చెలామణి అయిన అమరవాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదుడ్డి శ్యామ్ సుందర్ రంగం లో ఉంటున్నట్లు వారి ప్రచారం సరళి నీ బట్టి తెలుస్తుంది. ఇద్దరు కూడా ఈ నెల 17 న నామినేషన్లు వేస్తున్నాం ఆర్యవైశ్యులను భారీ ఎత్తున హాజరు కండి అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం చేసుకున్నారు మిడిదుడ్డి శ్యామ్ సుందర్ లకడికాపూల్ లోని వాసవి సేవకేందద్రానికి, అమరవాది లక్ష్మీనారాయణ కర్మాంఘట్ లక్ష్మి కన్వెన్షన్ కు రావాలని వైశ్యు లకు పిలుపునిచ్చారు. వీరిద్దరు కాకుండా యింకా ఎవరైనా పోటీలోకి వస్తారా అనేది సోమవారం వరకు వేచి చూడాల్సిందే. అయితే 11యేండ్ల నుండి మహాసభ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న అమరవాది పై సోషల్ మీడియాలో పలు విమర్శలు గుప్పుమంటున్నాయి. బై లా ప్రకారం 2సంవత్సరాలకు ఎన్నికలు పెట్టకుండా అక్రమంగా పదవిలో ఉన్నాడని, ఉన్నని రోజులు వైశ్యులకు చేసింది ఏమీలేదని, తాను మాత్రమే రాజకీయంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందాడని మార్పు రావాలని కోరుతూ పలువురు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల లో లక్ష రూపాయల నామినేషన్ ఫీజు, IVF, WAM వారు పోటీ కి అనర్హులు అంటూ వచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ పై భారీగానే విమర్శలు చేస్తూ అమరవాది హటావో అంటూ మహాసభ బచావో అంటూ ఘాటుగా కొందరు స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల లిస్టు కూడ ప్రకటించకపోవడం, పలు సమావేశాల్లో  అసభ్యంగా దూషించడం కూడ భారీ విమర్శలకు తావిచ్చింది.   మరో వైపు మిడిదుడ్డి శ్యాంసుందర్ తాను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షునిగా సేవలందించడం జరిగిందని, శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేస్తూ, ప్రతి సం.రము సలేశ్వరం (నల్లమల ఫారెస్ట్) లో 5 రోజులు (24 గంటలు) వేలాది మందికి అన్నప్రసాద కార్యక్రమము నిర్విరామంగా నిర్వహిస్తున్నామని, శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, శ్రీశైలం అధ్యక్షునిగా ఉండి శ్రీశైలంలో 140 రూములతో అధునాతనంగా భవనము నిర్మించి 2023 లో ప్రారంభించి అధ్యక్ష హోదాలో సేవలందిస్తున్నాననీ, తిరుపతిలో టి.జి. వెంకటేష్ సహకారంతో శ్రీనివాస నిత్యాన్న సత్రం త్వరలో నిర్మించబోతున్నామని ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినట్లు అయన ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా  ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలో మిడిదొడ్డికి ఎక్కువ కౌన్సిల్ సభ్యుల మద్దతు ఉన్నట్లు పరిశీలనలో తేలింది. హైద్రాబాద్ లో బస్తీ సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. అమరవాది పై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారమ్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాత్రం అమరవాది కే మద్దతు ఉన్నట్లు అంచనాలు, ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో చేరి సగం అన్నట్లు ఉన్నదని పలువురు అభిప్రాయాలు వెలిబుస్తున్నారు. ముఖ్యంగా శాశ్వత కౌన్సిల్ సభ్యులు 300 వరకు ఉన్నట్లు ఉంది. వారి లో చాలా వరకు అమరవాది వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఉన్నట్లు, చాలా వరకు మార్పు కోరుకుంటున్నట్లు సమాచారం. ఇది శ్యాంసుందర్ కు లాభం కావచ్చు ఏది ఏమైనా ఎన్నికలు జరిగే వరకు ఎవరు గెలుస్తారో అనేది వేచి చూడాల్సిందే.

ఈ విశ్లేషణ నచ్చితే షేర్

 చేయండి




Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!