మహాసభ లో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ప్రవర్తించిన A టీమ్ అప్రజాస్వామిక పోకడలకు చెంపపెట్టు.


 మహాసభ లో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ప్రవర్తించిన A టీమ్ అప్రజాస్వామిక పోకడలకు చెంపపెట్టు.


హైద్రాబాద్: మొదటి నుండి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ విషయంలో అప్రజాస్వామ్యం తాండవించింది. ఎప్పటికైనా ప్రజాస్వామ్యం నెగ్గుతుందని ఈ కోర్టు జోక్యాలే  సాక్ష్యం. ఈ విషయం తో ఇప్పటికైనా A టీం కు జ్ఞానోదయం కావాలి. బడా నాయకులందరూ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభను ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించేందుకు అన్ని కోర్టు కేసులు రద్దు జరిగేలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా పునుకుంటే బాగుంటుందని పలువురు ఆర్యవైశ్యులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ప్రకటించిన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు ఎన్నికలు ల్లో నలుగురు నామినేషన్ వేశారు. అందులో ఒకరు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు స్టే వచ్చింది. ఆయన నేనే అధ్యక్షుడిని అని ప్రకటింప చేసుకొని 9 మందితో తెలంగాణ ఆర్యవైశ్య A టీమ్ నాయకుడు మహాసభ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని మేమే తెలంగాణ ఆర్యవైశ్యులు లకు హక్కుదారులమంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ లో ఉన్న ఎఫ్డీలు పంచుకున్నారు. అంతేకాకుండా వైశ్య భవన్ కూడా పార్టిషన్ ఈ సొసైటీ పేరుతోనే చేసుకున్నారు. తెలంగాణలో ఏ పెద్ద ఆర్యవైశ్య నాయకుడు లేడని మేమే అంతా అని గత 11 సంవత్సరాలుగా రాజ్యాన్ని ఏలుతున్నారు. కొందరు అంటే మిడిదుడ్డి శ్యాం శ్యాంసుందర్, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, సీనియర్ లీడర్ మొగుళ్ళపల్లి ఉపేందర్, కాచం సత్యనారాయణ లాంటి నాయకుల ఒత్తిడి తో మరియు ఎన్నికలు చేయాలని కోర్టు కేసుతో ఎట్టకేలకు ఎన్నికలు ప్రకటన చేయించారు. ఎన్నికల ప్రకటన నుండి ఇప్పటి వరకు కూడా అంతా అప్రజాస్వామికంగానే జరిగింది. ఎన్నికల అధికారి నియామకం, ఎన్నికల నోటిఫికేషన్లో నిభందనలు, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల స్కూటీనీలలో కూడా ఏకపక్షంగా తమకు అనుకూలంగా చేసుకోవాలని చూశారు. చివరకు పోటీ ఇచ్చే అభ్యర్థిని కూడా స్కూటీలలో తొలగించుటకు పూనుకొని ఆ అభ్యర్థులను డి మోరల్ చేసి బ్లాక్ మెయిల్ చేసి తమకు అనుకూలంగా తిప్పుకొని మళ్లీ మేమే అధికారం చలాయించాలని భావించిన A టీంకు కోర్టు బాగా బుద్ధి చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మొదలైంది అసలైన ఆట. ఐవిఎఫ్ వామ్ ల నాయకులను పోటీ చేయకుండా బైలాలో లేని నిబంధన, నామినేషన్ ఫీజు భారీగా పెంచి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై ఐవిఎఫ్ నాయకులు గట్టు మహేష్ కుమార్ కోర్టుకు వెళ్లి ఎన్నికల అధికారికి ఐవిఎఫ్ వామ్ సభ్యులను కూడా కన్సిడర్ చేయాలని ఎన్నికల అధికారికి నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా షాద్నగర్ చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మొత్తం ఎన్నికల ప్రక్రియ పైన కోర్టుకు పోవడంతో ఎన్నికలకు కోర్టు బ్రేక్ ఇచ్చింది. అడ్వకేట్ కమిషన్ నియమించుటకు మార్చి 4వ తేదీకి. మెయిన్ కేసు 21 కి  వాయిదా వేసింది. ఇప్పటికైనా భగవంతుడు ఆ టీంకు కనువిప్పు కలిగించాలని పలువురు కోరుకుంటున్నారు. ఐ వి ఎఫ్ & వామ్ ల సభ్యులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టును తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికలు బైలాలో ఉన్న ప్రకారంగా మాజీ మహాసభ అధ్యక్షులు పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని, అంటే మాజీ అధ్యక్షులు అయిన వైశ్య శంఖారావం పూరించిన గంజి రాజమౌళి గుప్త ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని, ఆ విధంగా పెద్ద నాయకులంతా అందరిని సమావేశపరచి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని సమస్త తెలంగాణ ఆర్య వైశ్యులు కోరుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ బైలా లో ఉన్న ప్రకారంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బైలాలో కూడా ప్రజాస్వామ్యం ఉట్టిపడేలా నిబంధనలు చేర్చి మహాసభను పటిష్టపరిచి గతంలో మాదిరిగా అన్ని కమ్యూనిటీ సంఘాలకు మార్గదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యులు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇప్పటికైనా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు ప్రవర్తించిన వారిలో మార్పు వస్తుందని భావిద్దామని అంతా మంచి జరుగుతుందని అందరికీ మంచి జరుగుతుందని ఆశపడుతున్న ఆర్యవైశ్యులు 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!