సెట్విన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ
సెట్విన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ
నల్లగొండ : (gudachari) : నల్లగొండలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వయం ఉపాధి కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీతో శిక్షణ ఇవ్వనున్నట్లు సెట్విన్ కో-ఆ ర్డినేటర్ ఎం. సరిత తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఎడ్యుకేషన్ కోర్సులు, కంప్యూ టర్ బేసిక్స్, పీజీడీసీఏ, డీటీపీ కోర్సుల్లో శిక్షణ నిస్తామని పేర్కొన్నారు.
విద్యార్థినులు, యువ తులకు కంప్యూటర్, బ్యూటీషియన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్స్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర 26 రకాల కోర్సుల్లో శిక్ష ణ ఇస్తామని తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 24 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కోర్సులు పూర్తి చేశాక జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు.
వివరాలకు 9705041789 ఫోన్ నంబర్ను సంప్రదిం
చాలని సూచించారు.
Comments
Post a Comment