అమరవాది లక్ష్మీనారాయణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అమరవాది లక్ష్మీనారాయణపై పోలీసులకు ఫిర్యాదు
*ఆర్యవైశ్యుడై ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలి*
👉 11 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఏం చేశాడో చెప్పాలి
👉 30 లక్షల మంది ఆర్యవైశ్యుల్లో 1000 మంది ఓటర్లతో గెలిచే గెలుపు గెలుపేనా...??
👉 అమరవాది లక్ష్మీనారాయణతో ఆర్యవైశ్యులు ఎంతో నష్టపోయారు
👉 సూర్యాపేట పోలీస్ స్టేషన్లో లక్ష్మినారాయణపై ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు
సూర్యాపేట,
ఆర్యవైశ్యుడై ఉండి బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొంతమంది ఆర్యవైశ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలని జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులుకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఇమ్మడి సోమ నరసయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవైశ్యులు ముసలివారు, వెదవలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అని సంభోదించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యుడై ఉండి ఆర్యవైశ్యులను కించపరచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 11 ఏళ్లు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఆర్యవైశ్యులకు సమస్యలు వస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్పందించకపోతే ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 ఏళ్లు అధ్యక్షుడిగా ఉండి తనకు తెలిసిన వారు బంధువులకు ఓట్లు నమోదు చేయించి వారి ఓట్లతోనే గెలవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉంటే 1000 మంది ఓటర్లు ఉండడం ఏమిటని ఆ ఓట్లతో గెలిచే గెలుపు గెలుపేనా అన్నారు. సూర్యాపేట మున్సిపల్ స్థానం జనరల్ కాగా మన ఆర్యవైశ్యుడికి చైర్మన్ పదవి ఇస్తామని ఇవ్వకుంటే ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. 11 సంవత్సరాలుగా మీ అధ్యక్ష పాలనలో ఆర్యవైశ్యులంతా వెనుకబడ్డారని విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని రిజర్వేషన్లు లేవని ఉన్న దగ్గర అన్యాయం జరుగుతుందని విలువ లేకుండా పోయిందన్నారు. ఆర్యవైశ్యులను గ్రూపులుగా విభజించి సిట్టింగులు వేయించి గెలవాలనుకోవడం దుర్మార్గమని ఇప్పటికైనా ప్రతి ఆర్యవైశ్యుడికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యబద్ధంగా సక్రమంగా బరిలో నిలిచి గెలవాలన్నారు. ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు మీలా వంశీ మాట్లాడుతూ ఇప్పటికీ 11 సార్లు అధ్యక్ష పదవిలో అమరవాది లక్ష్మీనారాయణ ఉన్నారని ఆయన వల్ల ఆర్యవైశ్యులకు ఒరిగింది ఏమీ లేదన్నారు. పైగా ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆర్యవైశ్యులను దుర్భాషలాడడం దారుణమని ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి 11 సంవత్సరాలుగా ఆయన ఏం చేశారో చెప్పకుండా తోటి ఆర్యవైశ్యులను దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై లక్ష్మీనారాయణకు పట్టింపు లేదని సమస్యల పరిష్కారం కు ఒక ప్రణాళిక తయారు చేసింది లేదన్నారు. అమరవాది లక్ష్మి నారాయణ వ్యాఖ్యలను ఆర్యవైశ్యులమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు గుండా శ్రీధర్, చింత వెంకన్న, యామ సంతోష్, మహంకాళి శివ, తల్లాడ కృష్ణమూర్తి, మాద్గుల శంకర్, కొత్త వెంకటేశ్వర్లు, కర్నాటి వంశీ, కొత్త వెంకన్న, వంగవీటి రమేష్, దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment