ఆరోగ్య కేంద్రాన్ని & సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.


 

 ఆరోగ్య కేంద్రాన్ని & సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.


నల్లగొండ జిల్లా: 

@ నార్కెట్ పల్లి మండలం, అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మకంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.


@ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన మెడికల్ అధికారి డాక్టర్ వరూధినికి సోకాజ్ నోటిస్ జారీ 


@ అనుమతి లేకుండా విధులకు గైర్ హాజరైతే చర్యలు తప్పవు. మరోసారి హెచ్చరించిన జిల్లా కలెక్టర్ 


     నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం నార్కెట్ పల్లి మండలం, అక్కనపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్ ను,మందుల స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. 

తనిఖీ సందర్భంగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వరూధిని ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైనట్లు సిబ్బంది ద్వారా ఆమె నిర్ధారించుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరు విధులకు గైర్ హాజరు కావద్దని జిల్లా యంత్రాంగం పదేపదే అధికారులు, సిబ్బందికి తెలియజేస్తున్నప్పటికీ డాక్టర్ వరూధిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా,ఎలాంటి సెలవు పెట్టకుండా విదులకు గైర్హాజరు కావడం ఆమెకు విధుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నదని, అందువల్ల ఆమెపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వరూధినికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.


     పి హెచ్ సి సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తదితరులకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మందుల స్టాక్ రిజిస్టర్ను తనిఖీ సందర్బంగా ఎలాంటి మందులు ఇస్తున్నారని? చికిత్స ఎలా చేస్తున్నారని? స్టాఫ్ నర్స్, తదితరుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న చికిత్స, వారి పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, అలాగే చిన్న పిల్లలకు ఇచ్చే టీకాలు ,తదితర వివరాలను అడిగారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా మంచి సేవలు అందించాలని, అందరిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. సమస్యాత్మక కేసులు వచ్చినట్లయితే నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి పంపించాలని సూచించారు.


       అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం చిన్న నారాయణపురం లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు .కళాశాల హాస్టల్ కిచెన్ ను, స్టోర్ ను, అలాగే వంట సరుకులు, కూరగాయలు, పప్పు దినుసులు అన్నిటిని పరిశీలించారు. వంటగది శుభ్రంగా లేకపోవడంపై ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి ప్రశ్న, జవాబుల ద్వారా విద్య సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థినిలకు చాక్లెట్లను పంపిణీ చేశారు. కాగా తమ కళాశాల హాస్టల్ కు పక్కా భవనాన్ని మంజూరు చేయాలని ప్రిన్సిపల్, సిబ్బంది జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేయగా పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.


      జిల్లా కలెక్టర్ వెంకట్ నార్కెట్ పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!