చండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికి తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి


 *చండూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికి తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి* 

నల్గొండ: గూఢచారి: చండూరులోని ప్రభుత్వ ఆస్పత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది అందరూ డ్యూటీలో ఉండడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గర్భిణీ మహిళలు, బాలింతలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉన్నట్లుగా గుర్తించారు. డాక్టర్ ద్వారా ప్రతిపాదనలు తీసుకొని త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆస్పత్రి కి నూతన భవనం ఏర్పాటు ప్రజా ప్రతినిధుల దృష్టిలో ఉందన్నారు. ఇప్పటికే మంజూరు అయిందని తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపే చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, ఆర్డీవో శ్రీదేవి తహసిల్దార్ దశరథ, వైద్యాధికారి డాక్టర్ రాజు తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!