అమరవాది కి బహిరంగ లేఖ వ్రాసిన చకిలం రమణయ్య



 అమరవాది కి బహిరంగ లేఖ వ్రాసిన చకిలం రమణయ్య


యధాతధంగా చదవండి

అయ్యా లక్ష్మీనారాయణ అమరవాది గారు, మీరు అధ్యక్షులే కాదు. కారణం 24 2015 రోజున ఓపి నెంబర్ 741/2015 లో అయ్యే నెంబర్ 743/2015 ద్వారా ఎలక్షన్ జరగవద్దని స్టే వచ్చింది. అడ్వకేట్ పేరి వెంకటరమణ గారు స్టే ఆర్డర్ తెచ్చినారు. కీర్తిశేషులు పూర్వపు అధ్యక్షులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు గారు తేదీ 28. 4. 2015 రోజున ఇచ్చిన ప్రకటన ప్రకారం 29.. 4 .2015 రోజున ఎన్నికలను రద్దు పరుస్తూ, తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చేవరక ఎన్నికలు నిలిపివేయడం అయినది అని సభ్యుల అందరికీ నోటీసు ద్వారా తెలియజేశారు. 27 4 2017 రోజున ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ స్టేట్ పేరున సొసైటీ రిజిస్ట్రేషన్ నేతి రాములు గారి సొంత గృహములో హౌస్ నెంబర్ 6-2-648 చింతల్ బస్తి ఖైరతాబాద్. ప్రస్తుతము ఉన్న మహాసభ అడ్రస్సు అని సొసైటీ రిజిస్ట్రేషన్ చేశారు. నేతి రాములు గారు ఇచ్చిన తప్పుడు వలన ఈ రిజిస్ట్రేషన్ జరిగినది ఇది వారి ఇల్లు కాదు. ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా నేతి రాములు గారు ఇది సత్యమని ఒక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. 28 4 2015 రోజున ఈ అఫిడవిడి ద్వారా 8 మంది ఇతరులను సభ్యులుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

*****"****** ఎలక్షన్ ప్రక్రియ జరిగినప్పుడు పదిమంది అధ్యక్ష పదవికి పోటీ పడుతూ నామినేషన్లు వేశారు. అట్టి నామినేషన్లలో ముగ్గురు విత్ డ్రా అయినారు. మిగతా ఏడుగురు అలాగే ఉన్నారు. అలా ఉండగా ఎలక్షన్లలో ఏకగ్రీవంగా అమరవాది లక్ష్మీనారాయణ గారు గెలిచినట్టుగా టీజీ వెంకటేష్ గారు శాలువా కప్పి సన్మానించినారు. తెల్లవారి కీర్తిశేషులు రోశయ్య గారు కూడా శాలువా కప్పి సన్మానించినారు. ఇక ఆ రోజు నుండి ఈరోజు వరకు అధ్యక్షుడిగా చలామనవుతూ జిల్లాల వారీగా రెండు సంవత్సరములకు ఒకసారి నూతన కార్యవర్గాన్ని ఏర్పరుస్తూ, తన మనుషులను నిలబెడుతూ, వారికి తోచినట్టుగా పదవులు ఇస్తూ, అధ్యక్ష స్థానంలో వారే సంతకాలు పెడుతూ ఆదేశాలు తెలంగాణ మొత్తంలో జారీ చేశారు. ఇటువంటి దురాగతానికి పాల్పడ్డా ఆర్యవైశ్యుల ప్రథమ పౌరుడు అని చెప్పుకోవడానికి ఎంత సిగ్గుగా ఉంటుందో హృదయం ఉన్న ప్రతి ఆడ మగ వైశ్యులు ఆలోచించాల్సిన విషయము. ఇట్టి విషయంపై ఇకనైనా సోదరులు ఆలోచిస్తూ, ఈరోజు తెలంగాణలో ఒక లక్ష చిల్లర మంది వైశ్యులు మెంబర్షిప్లు చేసుకొని ఉన్నారు.. అటువంటి వైశ్యులకు మెంబర్షిప్ పైసలు తీసుకోవడము వరకే.తర్వాత వారికి ఎలాంటి సహకారాలు అందించుడు గాని, ఎలాంటి సేవలు చేసిన పాపాన పోలేదు. వారు గతంలో టిఆర్ఎస్ పార్టీలో చేరి మూడు సంవత్సరాలు కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని అలంకరించారు. దాని కారణం ఆర్యవైశ్యుల ప్రథమ పౌరుడు అని. ఆరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆశీర్వదించారు, కోలేటి దామోదర్ గారు సహకరించారు. టిఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికలలో అంచనాల ప్రకారం ఓడిపోతుందని తెలిసి ఎలక్షన్కి ఒకరోజు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఘనత మన సోదరుడిదే. కాంగ్రెస్లో మళ్లీ అధికార పదవిని పొందాలనే దురాలోచనతో మళ్ళీ వైశ్యుల దగ్గరికి వచ్చాడు. ఎలక్షన్ అంటున్నాడు. నేనే నిలబడతాను అంటున్నాడు. జిల్లాల వారీగా మీటింగులు పెట్టి తన అనుచర గణంతో ముందుకు వెళుతున్నాడు...., పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ పూర్వపు అధ్యక్షుడు శ్రీ కోలేటి దామోదర్ గారు వైశ్యుల కోసం ఆ రోజు కేసీఆర్ గారిని ప్రాధేయపడి దరఖాస్తు పెట్టి బిగాల గణేష్ ఎమ్మెల్యే గారి పేరుతో ఈ ఇద్దరికి కలిపి ఆర్యవైశ్య మహాసభ కి ఐదు ఎకరాల భూమిని కేటాయించిన విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం తెలువని వారికి నేనే తెచ్చాను, నేనేదో సాధిస్తాను,. మళ్లీ అవకాశం ఇవ్వండి అని మండల జిల్లాల వైశ్యుల ముంగిట్లోకి వస్తున్నాడు. గతంలో ఏం సేవలు చేశాడు అడగండి. మీటింగ్లకు వచ్చినప్పుడు నిలదీయండి. వారు చేసిన సేవల్ని తెలపమనండి. ఆర్థికంగా వెనకబడిన ఆర్యవైశ్య కుటుంబాలు ఎంతవరకు లబ్ధి పొందారు మన సోదర సోదరీమణులు. విద్యా నిధి ద్వారా నా బీదవారికి హాస్పిటల్ ద్వారానా గూడు గుడ్డ ఎలాంటివి చేశారు అడగండి. అసలు బీద ఆర్యవైశ్యులు తెలంగాణలో ఎంత మంది ఉన్నారో ఆ అధ్యక్షుడికి ఏమైనా తెలుసా? ఎప్పుడైనా వారిని కలిసారా? ఇవన్నీ మననం చేసుకోవాల్సిన అవసరం ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ కూడా అవసరం. కాబట్టి దయచేసి బైలాస్ ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరగాలి. ఆ ఎలక్షన్లు కూడా ఆర్యవైశ్య మహాసభ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో సభ్యత్వం ఉన్న ఆర్యవైశ్యుల ద్వారా మాత్రమే జరగాలి అనేది నా సంకల్పం. కారణం మెంబర్షిప్ డబ్బులు తీసుకుని వారికి మనం కనీసం ఓటు హక్కు అయినా ఇవ్వద్ద? మరెందుకు మెంబర్ ? కాబట్టి ఓటర్ ఎలక్షన్ లో పాల్గొనాలి ఇది ధర్మం. ఈరోజు వరకు జనరల్ బాడీ పెట్టి ఏ రోజు కూడా సభ్యుల యొక్క బాధలు తెలుసుకున్న పాపాన పోలే, ఇప్పుడు మరొక రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడి స్థాయిలో మరొక పదవి పొందుటకు తను వేస్తున్న పాచిక. సోదరులారా గ్రహించండి పర్సనల్గా ఎవరికి ఎవరితో కోపం లేదు. మనం రాసుకున్న బైలాకే గౌరవం ఇవ్వాలి. అవసరమైతే జనరల్ బాడీ లో బైలాను మార్పు చేసుకుందాం. దయచేసి ఆలోచించండి. నవ రక్తం రావాలి. కొత్తగా ఆలోచించాలి. గ్రామ మండల జిల్లా రాష్ట్ర ఆర్యవైశ్య సోదర సోదరీమణులకు సహకారం ఇవ్వాలి. అటువంటి సోదరుని ఎన్నుకోవాలి. ఇదే నేను అందరికీ చేస్తున్న అభ్యర్థన.

వైశ్య కుల అమ్మవారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా దురాలోచన లేకుండా ఎవరిపైన దూషణ భాషను చేయకుండా నాకు నేనుగా ఒక వైశ్య సోదరుడిగా ఈ యొక్క వివరాలు పెట్టాను తప్పుగా ఉంటే అన్యధా భావించకండి మీ సోదరుడిగా భావించండి ధన్యోస్మి.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!