మహాసభ ఎన్నికలు సజావుగా జరగాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి*


 *మహాసభ ఎన్నికలు సజావుగా జరగాలి*









*హైదరాబాద్ ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు*


👉 *బేగంపేటలోని ఒక దారికి రోశయ్య మార్గ్ గా నామకరణం*


👉 *వెంటనే చర్యల కై అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి*


👉 *సీఎంని హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసిన ఆర్యవైశ్య ప్రముఖులు*


హైదరాబాద్, ఫిబ్రవరి 20:

ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంఓ ఓ ఎస్ డి శేషాద్రిని ఆదేశించారు. 

ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు మిగతా సంఘాల ఎన్నికలకు ఆదర్శంగా ఉండాలి. అందుకు అధికారికంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను చట్ట రీత్యా తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

అలాగే తను కల్వకుర్తి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్య వైశ్యుల ముద్దు బిడ్డ రోశయ్య విగ్రహాన్ని హైదరాబాదులోని ఆయన ఇంటికి సమీపంలో గల ప్రకృతి చికిత్స ఆలయంలో ఏర్పాటు మరియు దానికి రోశయ్య  నామకరణం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. 

అపర తెలంగాణ గాంధీగా పేరున్న మరో ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వెల్దండ గ్రామానికి చెందిన బికుమాండ్ల ముత్యాలు విగ్రహావిష్కరణ సందర్భంగా రోశయ్య తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన విషయాన్ని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. 

సీఎం ను కలిసిన ఆర్యవైశ్య ప్రముఖుల్లో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా, ఉమ్మడి ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్తా, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నందారం ప్రశాంత్, మహాసభ విద్యా కమిటీ చైర్మన్, అధ్యక్ష్య అభ్యర్థి మిడిదొడ్డి శ్యాంసుందర్, ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, వంగూరు సురేష్, చకిలం రమణయ్య తదితరులు ఉన్నారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!