భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన పురందేశ్వరి


 భూపతి కృష్ణమూర్తి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించిన పురందేశ్వరి తెలంగాణ గాంధీగా ప్రసిద్ధి _చెందిన_ భూపతి కృష్ణమూర్తి గారి 99 వ జయంతి శుక్రవారం రోజున కరీంనగర్  వైశ్యభవన్ లో ఏర్పాటుచేసిన సమావేశమును ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి ఎంపీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు మాట్లాడుతూ భూపతి కృష్ణమూర్తి గారి శతజయంతి వేడుకలు తమ చేతుల మీదుగా ప్రారంభించుట అదృష్టంగా భావిస్తూ ఆ మహానీయునికి పుష్పాంజలి ఘటించారు .భూపతి కృష్ణమూర్తి స్మారక కమిటీ ప్రతినిధి ఉప్పల రామేశం మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గాంధేయ వాది, 1946 సంవత్సరంలో మహాత్మా గాంధీతో వారద సేవాశ్రమంలో పది రోజులు ఉన్నారని దండియాత్రలో పాల్గొని జైలు శిక్షలు, 1947 ,48 కాలంలో నిజాం రజాకారులను ఎదిరించి కొన్ని సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారని తెలియజేశారు, 1967 నుండి 72 వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు, 2000 సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పలుమార్లు పాల్గొని జైలు శిక్ష అనుభవించారని తెలియజేశారు, ముల్కనూర్ కోపరేటివ్ సొసైటీ వ్యవస్థాపకులుగా చైర్మన్గా విశేష సేవలను అందించారని తెలియజేశారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా, వారసత్వముగా లభించిన 500 ఎకరాల భూమిని కోల్పోయారని తెలియజేశారు, ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాతనే తన జీవితం చాలిస్తానని ప్రతిజ్ఞ చేసి తెలంగాణ సాధించిన ఎనిమిది నెలల తర్వాత స్వర్గస్తులైనారు , 2015 వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో ఆయన అంతక్రియలు నిర్వహించారు, ఈ సందర్భంగా రామేశం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కృష్ణమూర్తి గారి జయంతిని మరియు వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించాలని ఆయన శతజయంతి సంవత్సరం సందర్భంగా ఆయనను తగు విధముగా గౌరవించి ఆయన విగ్రహమును హైదరాబాద్ ట్యాంక్ బండి వద్ద ఏర్పాటు చేయాలని ఏదేని విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి గౌరవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు కృష్ణారెడ్డి, గుగ్గిల రమేష్, వివిధ సంఘాల నాయకులు మరియు స్మారక కమిటీ సభ్యుడు చిదుర సురేష్, కాసం కృష్ణమూర్తి , రాచమల్ల ఆంజనేయులు, ఎలగందల మునీందర్ , కొమురవెల్లి వెంకటేశం, రావి కంటి భాగ్యలక్ష్మి, ఏవి మల్లికార్జున్, వంగల పవన్, భద్రయ్య, సబ్బని లక్ష్మీనారాయణ , కైలాస నవీన్ , బొడ్ల శ్రీరాములు, మొదలగువారు పాల్గొని కృష్ణమూర్తి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు..

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!