IVF & WAM సభ్యులకు మహాసభ ఎన్నికలో పోటీకి అనర్హత క్లాస్ 3 అంశాన్ని వెంటనే తొలిగిoచాలి లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి - IVF తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్


 

IVF & WAM సభ్యులకు మహాసభ ఎన్నికలో పోటీకి అనర్హత క్లాస్ 3 అంశాన్ని వెంటనే తొలిగిoచాలి లేదా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి - IVF తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్

హైద్రాబాద్: 

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు WAM లో ఇంతకు ముందు పదువులు అనుభవించిన, ఇప్పుడు పదవి అనుభవిస్తున్న వ్యక్తులకు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్ లో పేర్కొన్న పోటీ కి అనర్హత కి సంబంధించి క్లాస్ 3 అంశాన్ని పై IVF రాష్ట్ర యూత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

నోటిఫికేషన్ లో క్లాసు 3 పోటీ కి అనర్హత కి సంబంధించి నిభందనలు పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెంటనే క్లాస్ 3 అంశాన్ని తొలిగిoచడం లేదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఆర్య వైశ్య మహాసభ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తోడుపునూరి చంద్రపాల్ కు మరియు కమిషనర్ & ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆఫీస్ లో వినతి పత్రం IVF రాష్ట్ర యూత్ వింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పత్రాలతో కోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపింది. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారనీ యూత్ వింగ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు కట్ట రవి కుమార్ గుప్త, రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ కటకం శ్రీనివాస్, రాష్ట్ర యూత్ ట్రెజరర్ నరేష్ గుప్త, రాష్ట్ర సెక్రటరీ ప్రవీణ్ గుప్త మరియు ఐవిఎఫ్ నాయకులు నాగరాజు,సాయికిరణ్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!