IVF & WAM గురించి మహాసభ ఎలక్షన్ ఆఫీసర్ కు హైకోర్టు నోటీసులు*
*మహాసభ ఎలక్షన్ ఆఫీసర్ కు హైకోర్టు నోటీసులు*
ఐవిఎఫ్ మరియు వామ్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు.
వెంటనే క్లాస్ 3 ( IVF మరియు WAM అనర్హతకు సంబంధించి) తొలిగించి తగు నిర్ణయం తీసుకోవాల్సింది గా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారి.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నేషనల్ EC. మెంబర్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మహాసభ అధ్యక్షులు గట్టు మహేష్ బాబు గారు క్లాస్ 3 కి వ్యతిరేకంగా వేసిన రిట్ పిటిషన్( IVF మరియు WAM లో పదవులు అనుభవిస్తున్న వ్యక్తులకు మహా సభ ఎలక్షన్ లో పోటీ చేయుటకు అనర్హత) సంబంధించి హైకోర్టు ఈరోజు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేస్తూ సదరు వ్యక్తులకు పోటీ చేసే అవకాశం ఇచ్చి అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది.
Comments
Post a Comment