రంగరాజన్ పై దాడి కేసులో చంచల్ గూడ జైలు లో ఉన్న వీర రాఘవరెడ్డి ని పరామర్శించిన ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్
రంగరాజన్ పై దాడి కేసులో చంచల్ గూడ జైలు లో ఉన్న వీర రాఘవరెడ్డి ని పరామర్శించిన ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్
హైద్రాబాద్ :
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీర రాఘవరెడ్డిని... చంచల్ గూడ జైలు లో ప్రముఖ న్యాయవాది K. N సాయికుమార్ కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కేఎన్ సాయికుమార్ మాట్లాడుతూ నేను వీర రాఘవరెడ్డిని పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశానని రాఘవరెడ్డి ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. వీర రాఘవరెడ్డి పై నమోదు చేసిన కేసు ఒక బూటకం అని, రాఘవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తాను రంగరాజన్ పై ఎటువంటి దాడి చేయలేదని కనీసం చేయి కూడా లేపలేదని కేవలం ఒక విషయమే చర్చించేందుకు చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లాలని, రామరాజ్యం తరపున అర్చకులు చేయవలసిన విధివిధానాలను, భక్తులకు ఉపదేశించవలసిన వివరాల గురించి మాత్రమే చర్చించానని రాఘవరెడ్డి తెలిపినట్లు సాయికుమార్ వెల్లడించారు...
Comments
Post a Comment