MLC బరిలో OU శంకర్
*MLC బరిలో OU శంకర్*
*నల్గొండ-వరంగల్-ఖమ్మం MLC బరిలో నిలబడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ OU Shankar ఈరోజు నల్గొండలో కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది.*
ఈ కార్యక్రమంలో *OU శంకర్ ని* బలపరిచిన ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ సమితి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లు,డిగ్రీ లెక్చరర్లు,పాలిటెక్నిక్ లెక్చరర్లు, గురుకుల సొసైటీలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ అధ్యాపక ఓటర్లు మద్దతు ఇచ్చి గెలిపిస్తే దశాబ్దాలుగా అపరిస్కృతంగా ఉన్న MEO,DyEOs,Dy IOSs Jls, DIET lecturers promotion లాంటి సమస్యలని పరిష్కరించడం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని గతంలో గెలిచినటువంటి సంఘాల నాయకులు *ఎమ్మెల్సీలు రాజకీయ పార్టీల కోసం , వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేశారనీ. అంతే కాకుండా పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందకుండా చేస్తూ , రాజ్యాంగ విరుద్ధంగా కాంట్రాక్టు లెక్చరర్ల క్రమ బద్దీకరణకు మద్దతు పలికిన ప్రస్తుత నల్లగొండ-వరంగల్-ఖమ్మం సిట్టింగ్ టీచర్ MLC , వారికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి అర్హత లేకున్నా ఓటర్ లిస్ట్ లో వారి పేర్లు తీయకుండా చేసినా ఈ విషయం లో మిగతా MLC లు , ఆయా సంఘాల నాయకులు నోరు మెదపకుండా మౌనం పాటిస్తున్నారనీ విమర్శించారు.
ఉపాధ్యాయుల , ఆచార్యుల హక్కుల కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదని ఆ కారణంగానే G.O. 317 లో స్థానికత, నిరుపయోగమైన E.H.S , స్కూల్ అసిస్టెంట్ టీచర్ లకు JL ప్రమోషన్లు లేకుండా చేసిన G.O. 223 ను రద్దు చేసి , G.O.302 ద్వారా ప్రమోషన్స్ ను పునరుద్ధరించడం. లాంటి సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. గురుకులాలు మోడల్ స్కూల్లో KGBV లలో మహిళ ఉపాధ్యాయునుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారయ్యాయనీ. కాబట్టి తనకు అవకాశం కల్పిస్తే ఈ సమస్యలను పరిష్కరించడం కోసం పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. తనకు మద్దతు ఇచ్చి బలపరిచిన ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ సమితికి ధన్యవాదాలు తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు సైదులు రెడ్డి గారు, ఖలీల్, గౌతమ్, కోటేశ్వరరావు, రవిశంకర్, సంపత్, స్వామి, రాజశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, బొజ్జ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment