మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు


 

మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు

 
హైద్రాబాద్:

 
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ బై లాకు మరియు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 కు  విరుద్ధంగా జరుగుతున్నందున,  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ డాక్యుమెంట్లు  అట్టేస్ట్  చేసి ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం క్రింద రిజిస్టర్ ఆఫ్ సొసైటీ హైదరాబాద్ సౌత్ గారి కార్యాలయం ప్రజా సమాచార అధికారి కి దరఖాస్తు చేసిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాజు.


తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడి నుండి ఇప్పటివరకు ప్రజాస్వామ్యబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 ప్రకారం గా ఇప్పుడున్న పాలకులు వ్యవహరించారా?  లేదా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించుట కొరకు దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు.


బైలా మరి అమెండ్మెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 ప్రకారం చేశారా?, రిజిస్టర్ ఆఫ్ సొసైటీ వారికి ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన డాక్యుమెంట్లు ఇచ్చారా?  అందులో ఏవైనా అక్రమాలు జరిగాయా?  అన్న విషయాన్ని పరిశీలించి చట్ట ప్రకారం మరియు బైలా ప్రకారం పాలకవర్గం చేయనట్లయితే వారిపై చర్యల కొరకు చట్టంలో ఉన్న అన్ని ప్లాట్ఫారంలకుఅన్ని వ్యవస్థలకు ఫిర్యాదు చేయుట కొరకు మరియు న్యాయపోరాటం చేయడం కొరకు, మరియు  ఇప్పుడున్న పాలకవర్గం వారు మేము ఆర్థికపరమైన లెక్కలను ఆడిట్ కూడా చేయించాం వాటిపై ఇన్కమ్ టాక్స్ వారు కేసులు కూడా నమోదు చేసినట్లు వారి వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అయినాయు. అట్టి వాయిస్ రికార్డుల్లో  మాట్లాడిన సబ్జెక్టు ప్రకారం ఏమైనా ఆర్థికపరమైన లోటుపాట్లు జరిగాయా? అని పరిశీలించుట కొరకు,  జరిగినట్లయితే వాటీ పైన వైట్ కలర్ నేరాల సెల్ కు ఫిర్యాదు చేయుట కొరకు ఈ యొక్క జిరాక్స్ కాపీలు అడిగినట్లు ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!