రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అధ్యక్షతన యుపిఎస్ వద్దని యుద్ధభేరి ధర్నా
ఓపిఎస్ నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్...
గో బ్యాక్ యుపిఎస్
ఏప్రిల్ 1 న బ్లాక్ డే
మే 1 న చలో ఢిల్లీ
సెప్టెంబర్ 1 న సామూహిక సెలవు,లక్ష కలాలతో కవాతు
ఈరోజు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అధ్యక్షతన యుపిఎస్ వద్దని యుద్ధభేరి ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లు భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇటీవల జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం యుపిఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీం అనేది ఏప్రిల్ 1 2025 నుండి అమలు చేయాలని గెజిట్ లో పేర్కొన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు ధర్నా ను నిర్వహించమన్నారు. ధర్నా లో రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఈ యుపిఎస్ విధానం అనేది కార్పొరేట్లకు ధన ప్రవాహం కొనసాగించుటకు కోసమే వచ్చిందన్నారు కేంద్రం ఆర్థిక శాఖ ఈ గెజిటెడ్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతే వసూలు చేసిన 10.5 లక్షల కోట్ల రూపాయల్ని అప్పనంగా కార్పోరేట్ చేతుల్లోనికి వెళ్తున్నాయని తెలిపారు. గత పది సంవత్సరాలుగా సిపిఎస్ వద్దని ఓ పి ఎస్ మాత్రమే సామాజిక భద్రతను చేకూర్చుండని పోరాటం చేస్తున్నామని, ఇప్పుడు ఈ యుపిఎస్ విధానం తెచ్చి ప్రభు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని గందరగోళానికి గురి చేస్తుందన్నారు.
ఇది ఏ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గానికి ఆమోదయోగ్యంగా లేదన్నారు.
అసలు ఈ యుపిఎస్ లో 56 జే రూల్ ప్రకారం ఉద్యోగి కంట్రిబ్యూషన్ 10% మరియు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 10% ఇలా సర్వీస్ మొత్తం జమ అయిన పెన్షన్ నిధిని ఉద్యోగి ప్రాన్ అకౌంటు ద్వారా ఎన్ పి ఎస్ ట్రస్ట్ కు బదిలీ చేశాకనే ఉద్యోగికు సర్వీస్ పెన్షన్ నిర్ణయం జరుగుతుందన్నారు.
అదే ఉద్యోగితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగుల కోసం పెన్షన్ను కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
గత పదిహేళ్లుగా సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ ఇవ్వాలని పోరాటం చేస్తే గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సాధించుకున్నామన్నారు. ఇంకా పాత పెన్షన్ లో ఉండే డి ఏ ఆధారిత సర్వీస్ పెన్షన్ ,కమ్యూటేషన్ సౌకర్యాలను సాధించుకోవాలన్న తరుణంలో ఈ యుపిఎస్ విధానం వచ్చిందన్నారు.
జనవరి నెలలో సిపిఎస్ విధానంలో రిటైర్ అయిన హైకోర్టు జడ్జి విశ్రాంతిని న్యాయమూర్తులకు కేవలం 6 నుండి 15వేల రూపాయల మధ్య పెన్షన్ అందుతుందని తెలిసి గౌరవనీయులైన సుప్రీంకోర్టు యే దిగ్భ్రాంతి పోయిందన్నారు. మన రాష్ట్రంలో 2003 DSC ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారని వారికి 2000 నుండి 5000 లోపే పెన్షన్ వస్తుందని,ఈ సొమ్ముతో కుటుంబాన్ని ఎలా గడిపేది గౌరవ ప్రద జీవనం ఎలా అన్నారు.? సామాజిక భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల కడుపు నింపే విధంగా తయారయ్యాయి అన్నారు.
సిపిఎస్ రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం లేదు.
గతంలో కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్ ,ఛత్తీస్గడ్ , ప్రస్తుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేస్తున్నాయన్నారు.
ప్రతినెల రాష్ట్రం నుంచి సిపిఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 450 కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ కు ఎన్.పీ.ఎస్ ట్రస్ట్ ద్వారా తరలిపోతాయన్నారు ఇటీవల ప్రభుత్వ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి గారు నియమించిన 51 వేల ఉద్యోగస్తుల సి.పి.ఎస్ సొమ్ముతో కలిపి దాదాపు 600 కోట్లు షేర్ మార్కెట్ కు తరలి పోతున్నాయన్నారు.
మన రాష్ట్రం సీపీఎస్ నుండి పాత పెన్షన్ లోకి వెళ్లినట్లయితే ఇప్పటివరకు గత ఇరవై ఏళ్లుగా ఉద్యోగ,ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ సొమ్ము ఉన్న పెన్షన్ నిధి 17 వేల కోట్ల రూపాయల ఇతర ప్రజా ప్రయోజన పథకాలకు ఉపయోగించుకోవచ్చునని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ సమయంలో పాత పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తే చాలన్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి ఓట్ ఫర్ ఓపిఎస్ ద్వారా దాదాపు 14 శాసనసభల్లో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల ప్రభావితం చూపారన్నారు.
మే 1 న చలో ఢిల్లీ
యుపిఎస్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1 నాడు బ్లాక్ డే గా పరిగణించి దేశంలోని ప్రతి జిల్లాలో ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ కలెక్టర్లకు వినతి ఇవ్వడం, అదేవిధంగా మే 1న చలో ఢిల్లీలో నిర్వహిస్తున్నామని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ తెలిపారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధ్యాయులు సామూహిక సెలవు పెట్టి లక్ష కలాలతో కవాతు నిర్వహిస్తామన్నారు.
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ పెన్షన్ చెల్లించే బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకొని ప్రజల సొమ్మును పెన్షన్ ఫండ్కు తరలించి షేర్ మార్కెట్లో పెట్టుబడులను పెంచడం ఈ సిపిఎస్ /యూ.పి.ఎస్ కి ముఖ్య లక్ష్యమని, పదవి విరమణ తరువాత జీవితం అస్థిరపడుతాయని, బి.పి.ఎల్ కుటుంబాలు గా మారుతాయన్నారు.
కంట్రిబ్యూషన్ లేని పెన్షన్ మనకు ఒక హక్కుగా అని, 2004లో సి.పి.ఎస్ విధానం వచ్చినప్పుడు ఎవ్వరు అడ్డుకోలేదని అదేవిధంగా 2014లో రాష్ట్ర ఏర్పడినప్పుడు పెన్షన్ విధానాల మార్పు అవకాశం ఉన్నప్పుడు వ్యతిరేకరించినందున సిపిఎస్ ను మళ్ళీ అమలు చేశారని, ఇక ఇప్పుడు ఏప్రిల్ 1 2025 నాడు యుపిఎస్ అమలు కోసం సీపీఎస్ నుండి ఏక్సిట్ అవకాశం వచ్చిందని , ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా సిపిఎస్ నుండి పాత పెన్షన్ విధానాల్లోనికి మారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధిని రాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కూరాకుల శ్రీనివాస్, సలహాదారు ఇన్నా రెడ్డి , పోల శ్రీనివాస్,మ్యాన పవన్ ,నరేందర్ రావు, శ్యామ్ సుందర్, శ్రవణ్ ,మల్లికార్జున్, దేవయ్య, గడ్డం వెంకటేష్, ఆవునూరి రవి,సోమనాథ్ ,శ్రీకాంత్ నాయక్,షఫీ ,లచ్చిరాం, జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment