దుబ్బ శ్రీనివాస్ ను రిమాండ్ కి తరలించిన పోలీసులు.

 




*దుబ్బ శ్రీనివాస్ ను రిమాండ్ కి తరలించిన పోలీసులు.*


ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపెట శివారులో గల ఎం.హెచ్ నగర్ లోని ప్రభుత్వ భూములలో, వరంగల్, కాశిబుగ్గలోని వివేకానంద కాలనీకి చెందిన దుబ్బ శ్రీనివాస్ అనే అతడు సిపిఎం పార్టీ పేరుతో గుడిసెలు వేసి, వాటిని తన ఆధీనంలోకి తీసుకొని, అమాయకులైన నిరుపేదలకు వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు తీసుకుంటూ, ఒకటే ఫ్లాట్ ని ఇద్దరు లేదా ముగ్గురికి అమ్ముతూ అడిగిన వారినీ ఇంకా అదనంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తేనే వారికి అట్టి ప్లాట్ ను అప్పగిస్తానని, అలా కాకుండా అతడు డబ్బులు తీసుకున్న విషయం ఎవరికైనా చెప్పితే చెప్పిన వారిని చంపుతానంటూ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడని తేదీ:20.02.2025 న బాధితులు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసిన ఇంతేజార్గంజ్ పోలీసులు. ఈరోజు అనగా తేదీ 28.02.2025న సదరు దుబ్బ శ్రీనివాసుని ఆధీనంలోకి తీసుకోనీ, అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది అని ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!