ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సభలో పాల్గొన్న ఉప్పల


 * *IVF న్యూ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త గారికి జరిగిన అభినందన సభలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్, TPCC ప్రచార్ కమిటీ కో-కన్వీనర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..*


ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో, ఈరోజు ఉదయం, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగి బిజెపి ముఖ్యమంత్రిగా ఆమె ఎంపిక కావడం ఐ వి ఎఫ్ కి ఎంతో గర్వకారణం, కావున ఇంటర్నేషనల్ ఫెడరేషన్ న్యూఢిల్లీ పక్షాన ఆమెకి *అభినందన సభ* ఏర్పాటు చేసి ఘనంగా అంగరంగ  వైభవంగా సన్మానించారు. 


👉 *ఈ సందర్భంగా శ్రీ  అశోక అగర్వాల్ గారు ప్రసంగి స్తూ....* ప్రపంచ చరిత్రలో ఒక మహిళ కుల సంఘానికి అధ్యక్షురాలుగా ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం అని ఆయన అంటూ, వివిధ రాష్ట్రాలలో మహిళలు రాజకీయాల్లో పాల్గొని, మంచి మంచి పదవులు పొందాలని, దీనికి ఐవీఎఫ్ ఎప్పుడు  ముందుంటుందని ఆయన అన్నారు.


👉 *ఈ సందర్భంగా శ్రీఉప్పల శ్రీనివాస్ గారు ఆమెను ఘనంగా సన్మానించి,ప్రసంగిస్తూ ..* ఒక మహిళ కులానికి సేవ చేస్తూ ఒక నాయకురాలిగా ఎదిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం అని తెలంగాణలో కూడా మహిళలను నేను ప్రోత్సహిస్తానని అంటూ మహిళలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.


👉 ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు అధ్యక్షుడు *శ్రీ అశోక్ అగర్వాల్ గారు*, ఐ వి ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ *శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు*, బిజెపి నాయకుడు శ్రీ జితేందర్ గారు, శ్రీ గందె సుధాకర్ గారు, మరియు వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, మహిళా సంఘాలు, యూత్ సంఘాలు, కార్యవర్గ సభ్యులు, అందరూ పాల్గొని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!