ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు - సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్
ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు - సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్
Hydrabad:
రాష్ట్రం లో ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్ తెలిపారు.
ఈ రోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల బడంగ్ పేట్ లో 7/3/2025 శుక్రవారంరోజున 10 గంటలకు *"జానహిత",సంస్కార శిక్షణ విభాగం* ఆధ్వర్యంలో రామాయణం పరీక్షలు నిర్వహిస్తు ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, నైతిక విలువలు, దేశభక్తి, సంస్కారం అందించాలనే ఉద్దేశ్యం తో తెలంగాణ ప్రాంతం అంతట రామాయణం పరీక్షలు ప్రారంభం చేశామని చెప్పారు. ఈ పరీక్షలలో పాల్గొన్న 251విద్యార్థులలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థిని విద్యార్థులకు సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్ బహుమతి ప్రదానం చేశారు.ఈ కార్యక్రమం లో ,శేఖర్ రెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు, అనిల్ కుమార్ మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేసిన అందరికి ధన్యవాదములు తెలియజేసారు.
Comments
Post a Comment