ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి
ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి
- ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా
ధర్మపురి, (గూఢచారి), మార్చి 07 :
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తెలంగాణ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ సభ వేదికలో అమరవాది మాట్లాడుతూ ఆర్యవైశ్యులను ఉద్దేశించి పని పాట లేని కొంతమంది వెధవలు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొనడం సరైంది కాదన్నారు. అయ్యా అమరవాధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిన మీరు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక కూడా మీకు మీరే అధ్యక్షుడిగా ప్రకటించుకొని 10 సంవత్సరాలు కొనసాగావు. అయ్యా మీ సేవలు మా ఆర్యవైశ్యులకు ఇక చాలు, మీకు సెలవు, అని యావత్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులంతా ముక్తకంఠంతో మీకు విన్నవించిన వినకుండా, మీరు మళ్లీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం అత్యంత జుగుప్సాకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా నీ కుట్ర పూరిత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులంతా ఏకమై నాగర్ కర్నూల్ కు చెందిన మిడిదొడ్డి శ్యాంసుందర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న తరుణం లో, నువ్వు పోటీ నుండి తప్పుకొని అతనికి ఏకగ్రీవంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని హోదా కల్పిస్తే, మిమ్మల్ని గౌరవాధ్యక్షునిగా కొనసాగి స్తూ మీకు ఎంతో కొంత గౌరవించే వాళ్ళం. కానీ కుక్క తోక వంకర అన్న చందంగా నీ గుణం మార్చుకోక ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరగకుండా అడ్డుకొని, నీకు సన్నిహితులుగా ఉన్న వారితో త్రిసభ్య కమిటీ ని ఏర్పాటుచేసి, కమిటీ నిర్ణయం మేరకు మళ్లీ అధ్యక్షునిగా కొనసాగతానని భావించడం మీ అవివేకాకానికి నిదర్శనమని అన్నారు. గత 10 ఏళ్లుగా మీ నాయకత్వంలో ఆర్యవైశ్యులు ఎవరు అభివృద్ధి చెందలేదని, ఆర్యవైశ్యులలో సంపన్న శ్రేణి వర్గాలనే నువ్వు అక్కున చేర్చుకున్నావని, పేద ఆర్యవైశ్య కుటుంబాలకు నీవు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుని హోదా నుండి తప్పుకోవాలని, లేనియెడల ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, నీకు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్యవైశ్య మహాసభ నాయకులు ముత్యం శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Post a Comment