ఇప్పుడు బయటకు రాకపోతే మరి ఎప్పటికీ మన గతి అంతే - నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ అశోక్
ఇప్పుడు బయటకు రాకపోతే మరి ఎప్పటికీ మన గతి అంతే - నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ అశోక్
నల్గొండ: (గూఢచారి): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కసరత్తులో భాగంగా జిల్లాల నుంచి కౌన్సిల్ లిస్ట్ కూడా ఇష్టానుసారంగా రాసుకొని ఎన్నికలకు పోవడం జరిగిందని నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ అశోక్ ఆరోపించారు. సరే ఏది ఏమైనా మహాసభకు ఎన్నికలు కావాలని అందరూ ఎన్నికలకు సై అన్నారనీ, కానీ వారు రాసుకున్న కౌన్సిల్ లిస్ట్ పై కూడా వాళ్లకు నమ్మకం లేక దొంగ దారిలో ఇద్దరితో విత్ డ్రా చేయించి శ్యాంసుందర్ నామినేషన్ను నాగర్ కర్నూల్ ఎన్నికలు పెట్టలేదనీ రిజెక్ట్ చేశామని వారు నియమించుకున్న ఎన్నికల కమిటీ చే ప్రకటన చేయించి తెలంగాణ ఆర్యవైశ్య మనోభావాలను కించపరిచినట్టు వ్యవరించడం జరిగిందని ఆయన విమర్శించారు. దీనికి నిరసనగా రేపు మహాసభ ప్రక్షాళన పేరున ఆర్యవైశ్య పెద్దలు హైదరాబాదులోని ఖర్మంఘట్ లో చర్చా కార్యక్రమం అలాగే భవిష్యత్తు కార్యాచరణ జిల్లాల వారీగా ప్రక్షాళన కమిటీలు వెయ్యడానికి రేపు సమావేశం పెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి నలగొండ జిల్లా మరియు నల్గొండ పట్టణ నుండి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని తమ తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా మనవి చేసారు. ఇప్పుడు బయటకు రాకపోతే మరి ఎప్పటికీ మన గతి అంతే నని అన్నారు
.
Comments
Post a Comment