ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ


 ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ

ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది


 మెదక్ ( గూఢచారి) : ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మెదక్ పట్టణం కు చెందిన శైలజ కు సర్వేనెంబర్ 505/1/2 లో 605 గజాల ఇంటి స్థలం ఉంది. భూమి మ్యుటేషన్ కోసం గత నెలలో దరఖాస్తు చేసింది. కానీ మ్యుటేషన్ కోసం మున్సిపల్ ఆర్ ఐ జానయ్య ను సంప్రదించగా పని చేయలేదు. దీంతో పలు మార్లు అతని వద్దకు వెళ్లిన ప్రయోజనం కలగలేదు.


దీంతో విషయం సోదరుడు ధర్మకారి శివకుమార్ కు చెప్పడంతో మున్సిపల్ ఆర్ ఐ వద్దకు వెళ్లి మ్యుటేషన్ చేయాలని కోరగా అందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమండ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ప్రభుత్వ అధికారి లంచం అడగడంతో శివకుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం బాధితురాలు సోదరుడు శ్రీనివాస్ తో కలిసి వెళ్లారు. జానయ్య కు రూ. 12 వేలు లంచం ఇవ్వగా సదరు అధికారి ఆ డబ్బులను ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అక్కడే కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకొని ఆర్ ఐ లంచంగా తీసుకున్న డబ్బులను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో, ఇన్స్పెక్టర్స్ రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


లంచం అడిగితే సంచారం ఇవ్వండి: ఏసీబీ డీఎస్పీ


ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ఏసీబీ కి సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. జిల్లాల్లో ఎక్కడ ఏ ప్రభుత్వ అధికారులైన లంచం అడిగితే 9440446106 తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!