ఏసీబీ కి చిక్కిన విద్య, సంక్షేమ శాఖ (EWIDC) అధికారి


 ఏసీబీ కి చిక్కిన విద్య, సంక్షేమ శాఖ (EWIDC) అధికారి


ఆదిలాబాద్‌ విద్య & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అధికారుల కథనం ప్రకారం... ఆదిలాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు బిల్లు మంజూరు చేసే విషయంలో ఆదిలాబాద్‌ విద్యా & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ సానుకూలంగా వ్యవహరించేందుకు సదరు వ్యక్తి నుండి ముందుగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసినారు. కాగా సదరు వ్యక్తి అభ్యర్థన మేరకు లక్ష రూపాయలకు తగ్గించి, మొదటి విడతగా 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు కోరారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!