తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను మర్యాద పూర్వకంగా కలిసిన JCHSL కమిటీ సభ్యులు.
*తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను మర్యాద పూర్వకంగా కలిసిన JCHSL కమిటీ సభ్యులు.*
*జర్నలిస్ట్ ల సంక్షేమానికీ, అభివృద్ధికి పాటు పడాలని కమిటీ సభ్యులకు గవర్నర్ సూచన*.
*Hyderabad 01-03-2025. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు శనివారం రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసిన JCHSL కమిటీ సభ్యులు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు, దాని కార్యకలాపాలను గవర్నర్ కు సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు వివరించారు. 1964 లో ఏర్పడిన సొసైటీ మూడు కాలనీల ఏర్పాటు, అక్కడ జర్నలిస్టుల సంక్షేమంకోసం సొసైటీ చేస్తున్న పనులను వారికి తెలియజేశారు. ఇంకా ఇండ్ల స్థలాల కోసం సుమారు 950 మంది జర్నలిస్టులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో జర్నలిస్టుల స్థితిగతులు, సుప్రింకోర్టు కేసు, మీడియా పరిస్థితులపై గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టుల కాలనీ సంక్షేమ, అభివృద్ధికి పాటు పడాలనీ నూతన కమిటీకి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. నూతన కమిటీ చేస్తున్న పనులను అడిగి తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఎం. రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు ఎం. లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి డా. చల్లా భాగ్యలక్ష్మీ, కోశాధికారి భీమగాని మహేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.*
Comments
Post a Comment