ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని ఇస్తుంది

నల్గొండ జిల్లా: గూఢచారి: భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యాన్ని ఇస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు. గురువారం అయన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని గుండ్లపల్లి మండలకేంద్రం డిండి లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక కార్యక్రమని ఆయన అన్నారు .ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యం పథకంలో అనేక లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా ఈ బియ్యం 90 శాతం రీసైక్లింగ్ అవుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో లేనివిధంగా సన్నబియాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నదని, అందువలన రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని ఆయన కోరారు. ఏదుల రిజర్వాయర్ నుండి చేపట్టిన దింది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని ఆయన తెలిపారు. ...