అయ్య ‘బాబ’య్య- గజ్వేల్ విద్యుత్ శాఖ డివిజన్ లో పనులు చేయాలంటే వణుకుతున్న కాంట్రాక్టర్లు
అయ్య ‘బాబ’య్య- గజ్వేల్ విద్యుత్ శాఖ డివిజన్ లో పనులు చేయాలంటే వణుకుతున్న కాంట్రాక్టర్లు
- ఏ పనికైనా కోర్రీ పెట్టడం ఆయన నైజం
- కాంట్రాక్టర్లను నిండా ముంచడం ఆయనకు సరదా
- డిఈ ఆఫీసులో అన్ని ఆయనే... అంతా ఆయనే...
- తాను చెప్పిందే నడవాలన్న అహాం
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు అయ్య ‘బాబోయ్’ అంటున్నారు. ఏ పనికి సంబంధించిన అంచనాలు ఇచ్చిన సదరు అధికారి కొర్రీలు దొరకబట్టి మరి... ఫైలును పెండింగ్ లో పెడుతున్నారు. గతంలో గజ్వేల్ డివిజన్ పరిధిలోనే పనిచేసిన సదరు అధికారి తాజాగా డివిజన్ ఆఫీసులో కీలక పోస్టులో చేరారు. అప్పటి నుండి కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. డివిజన్లో కీలక అధికారి వెంటే రావడం... కీలక అధికారి వెంటే వెళ్లడం ఆయన దినచర్య. దీంతో ఏ పని ముందుకు వెళ్లక ఏ పని చేసుకోలేక కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్పుకోవాలన్న ఎక్కడ తమ పనులు నిలిపివేస్తారో అని భయపడుతున్నారు. ఇప్పటికే సదరు అధికారి పుణ్యమా అని అనేకమంది కాంట్రాక్టర్లు అప్పులపాలై ఆగమవుతున్నారు. పనిచేస్తేనే తమకు రూపాయి వస్తుందని, వినియోగదారుడికి త్వరితగతిన పని పూర్తి చేసినవారం అవుతామని, ఈ అధికారి మూలాన రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారిందని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు.
- డివిజన్ అధికారికి బాధ్యత ఉందా...?
సదరు అధికారి డివిజన్ అధికారి వెంటే రావడం.. డివిజన్ అధికారి వెంటే వెళ్తుండడం పట్ల ఇటు కాంట్రాక్టర్లు అటు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులో ఉండి పనులు చెక్కపెట్టాల్సిన సదరు అధికారి… డీఈ వెంటే వస్తూ… వెళ్తూ ఉండడంతో పనులు ముందుకు సాగగా కాంట్రాక్టర్లు, ఇచ్చిన సమయానికి పని పూర్తి జరగక వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తన వెంటే తీసుకువచ్చి తీసుకు వెళుతున్న అధికారి సదరు అధికారి ఉద్యోగ నియమాలను గూర్చి, ఆయన పని విధానం గూర్చి అవగాహన ఉండి మరి ఇలా చేస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. డివిజన్ అధికారికి బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిజాయితీ గలిగిన డివిజన్ అధికారి తాను నిజాయితీపరుడునని బయటికి చెబుతూ తన కిందిస్థాయి అధికారితో తనకు కావాల్సిన పనులన్నీ చక్కబెడుతున్నారన్న అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.
- సదరు అధికారి చేతలతో రోడ్డున పడ్డ కాంట్రాక్టర్లు కోకోళ్లలు
సదరు అధికారి చేతివాటం, అహంభావంతో అనేకమంది కాంట్రాక్టర్లు రోడ్డున పడి అప్పుల పాలయ్యారు. గతంలో ఇదే డివిజన్ పరిధిలో పనిచేసిన ఓ కాంట్రాక్టర్ తో పనిచేయించిన సదరు అధికారి అంచనాలో లేని పని చేయాలని అందుకు సంబంధించిన డబ్బులు ఇప్పిస్తానని అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంట్రాక్టర్ సదరు పని చేయకపోవడంతో అప్పటినుంచి కాంట్రాక్టర్ పై కక్ష కట్టిన సదరు అధికారి ప్రస్తుత పనులకు అడ్డుతెలగడమే కాకుండా తనను కనీసం మనిషిగా కూడా గుర్తించడం లేదని కాంట్రాక్టర్ వాపోతున్నారు. గతంలో ఇదే అధికారి ఓ కాంట్రాక్టర్ తో ఓ సాగునీటి రిజర్వాయర్ కు సంబంధించిన పనులు చేయించి లక్షల్లో డబ్బులు పెట్టించి... వేలలో బిల్లులు ఇప్పించడంతో సదరు కాంట్రాక్టర్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. డివిజన్ పరిధిలోని ఓ మండలంలో సదరు అధికారి బాధ్యుడిగా పని చేసిన సమయంలో అక్కడ పని చేస్తున్న కాంట్రాక్టర్ అప్పుల పాలై రోడ్డు మీదికి వచ్చాడు. ఇక డివిజన్ ఆఫీసులో బదిలీపై వచ్చిన అనంతరం ఇక్కడి ఓ బడా కాంట్రాక్టర్ తో అనేక పనులు చేయించి బిల్లులకు సంబంధించిన ఫైల్స్ ను మాయం చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఇక మరో కాంట్రాక్టర్ తో ఊడిగం చేయించుకొని మరి రోడ్డుపైకి తీసుకువచ్చాడు. గజ్వేల్ పట్టణానికి చెందిన ఇంకో డివిజన్ స్థాయి కాంట్రాక్టర్ సదరు అధికారి పెట్టే వేధింపులతో పనులు చేయడం సైతం మానేశాడు. ఇంకా జరుగుతున్న ఉన్నతాధికారి సదరు అంశంపై దృష్టి సారించకపోవడం పట్ల విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా డివిజన్ స్థాయి అధికారికి అనుసరణలోనే జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత స్థాయి విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సదరు షాడో అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Post a Comment