*కంది పప్పు టెండర్ లో మహబూబ్నగర్ రూట్ సపరేటు*?
*కంది పప్పు టెండర్ లో మహబూబ్నగర్ రూట్ సపరేటు*?
హైద్రాబాద్, గూఢచారి:
ఒక వైపు మంత్రి, ఇంకో వైపు డైరెక్టర్ కందిపప్పు కొనుగోలు లో ఎలాంటి అవకతవకలు లేకుండా ఇ ప్రొక్యూర్మెంట్ ద్వారా పారదర్శకంగా టెండర్ ఖరారు చేయాలన్న ఆదేశాలను తుంగ లోకి తొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ జిల్లాలో పెట్టని నిబంధన మహబూబ్నగర్ జిల్లా టెండర్లలో పెట్టీన ఉదంతం జరిగినట్లు తెలుస్తుంది.
అంగన్వాడీ సెంటర్ల కొరకు కందిపప్పు కొనుగోలు లో అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమనడం తో కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని , ఈ-టెండర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదని , మీ తప్పిదాల వల్ల మేము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని , కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరా ను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది..సంజాయిషీ ఇవ్వాల్సిందనని, పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతిని నిలిపి వేసి ఈ- టెండర్ విధానాన్నీ అవలంబించండని ఒక వైపు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అవుతూ కలెక్టర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్ మెంట్ కమిటీ ద్వారా టెండర్లు పిలవండిని ఆదేశాలు జారీచేస్తుంటే,
మరో వైపు డైరెక్టర్ కంది పప్పు ధర నిర్ణయించడానికి టెండర్ పిలవడం ద్వారా సూచనలను పాటించని జిల్లా అధికారులపై విచారణ జరుగుతుందనీ, అంతేకాకుండా, జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా పారదర్శకంగా టెండర్ పిలవాలని అధికారులను ఆదేశించారు. టెండర్ లేకుండా నామినేషన్ పై ఇచ్చిన ఆర్డర్లను రద్దుచేశారు.
ఇంత తతంగం జరుగుతున్న మహబూబ్నగర్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా లేని నిబంధన పట్టి ప్రభుత్వ సొమ్ము కు నష్టం కలిగించే విధంగా టెండర్ లో నిభందనలు పెట్టారని కొందరు కాంట్రాక్టరులు ఆరోపిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా లో పప్పు సరఫరా టెండర్ వేయాలంటే ఉమ్మడి జిల్లా కాంట్రాక్టర్ లు మాత్రమే టెండర్ వేయాలని నిబంధన పెట్టారని, మహబూబ్నగర్ లో పప్పు సరఫరాకు ఇతర జిల్లాలకు చెందిన నలుగురు కాంట్రాక్టర్ లు వేసిన టెండర్లను డిస్కులిఫై చేస్తున్నట్లు తెలిసింది.
ఉమ్మడి జిల్లా వారు మాత్రమే టెండర్ వేయాలన్న నిబంధన తో పోటీ తగ్గి పప్పు ధర పెరిగే అవకాశాలు ఉంది. అంతే కాకుండా టెండర్ వేసే కొందరి హక్కు ను హరించే విధంగా ఉంది.
గత ఏడాది కూడా మహబూబ్నగర్ లో కంది పప్పు ను రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువ చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం పై మంత్రి, డైరెక్టర్ తక్షణం సంధించి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ప్రకారంగా నిభందనలు సవరించి అక్రమాలను అరికట్టాలని కొందరు కాంట్రాక్టర్ లు కోరుతున్నారు
Comments
Post a Comment