కులవివక్షకు బలైన మల్లేశ్వరి మరణానికి కారణమైన జాన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి - పాలడుగు నాగార్జున
కులవివక్షకు బలైన మల్లేశ్వరి మరణానికి కారణమైన జాన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి - పాలడుగు నాగార్జున
మల్లీశ్వరి. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. నిడమానూరు మండలం నివాసి జిల్లాలో సంక్షేమ గురుకులాల్లో చదివిందని హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గత ఏడేళ్లుగా నర్స్ గా పనిచేస్తున్నది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తనే ఆ కుటుంబానికి అండగా ఉన్నదని పాలడుగు నాగార్జున తెలిపారు.
జాన్ రెడ్డి అనే ఒక వ్యక్తితో గత ఏడేళ్లుగా Live In Relationship లో ఉన్నదని తెలిసినది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పినందు వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుడ్డిగా నమ్మిందనీ. యధావిధిగా తక్కువ(?) కులం వాళ్లతో పెళ్లేంది, మన పరువు ఏమైతది అని బంధువులంతా అంటున్నారని అతను ఈమెకు తెలియకుండా వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడని, ఈ విషయం తెలుసుకున్న ఈమె అన్ని ప్రయత్నాలు చేసి, అవమానానికి గురై రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు
శవంతో ధర్నా, పోలీసుల కేసులు, బెదిరింపులు, తల్లిదండ్రుల రోదనలు, రాజీ కమ్మని ఒత్తిళ్లు పేదలకు కొత్త కాదని , ఇప్పటికీ కూడా నిందితులు ‘పరారీలో’ నే ఉన్నారని, అరెస్ట్ కాలేదని తెలుస్తున్నదనీ. FIR లో జాన్ రెడ్డిఅతనికి సహకరించిన బంధువుల పేర్లు చేర్చాలనీ.sc st అట్రాసిటీ కేసులు నమోదు చేయాలనీ. ఫాస్ట్రాక్ట్ కోర్ట్ ధ్వరా విచారణ జరిపి నిందితులకు కఠినంగా శిక్షంచాలని కోరుతూ నల్గొండ జిల్లా sp కి వినతి పత్రం ఇచ్చారు.
Comments
Post a Comment