విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను నిలిపివేసిన హైకోర్టు:
విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను నిలిపివేసిన హైకోర్టు:
తెలంగాణ విద్యుత్ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తేదీ జూన్ 2, 2014 నుండి ఇచ్చిన పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పర్యవాసనంగా రావలసిన సీనియారిటీకి సంబంధించి పదోన్నతులను ఎనిమిది వారాల్లో సమీక్షించి నష్టపోయిన బిసి, ఓసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడెపాక కుమార స్వామి, తెలంగాణ విద్యుత్ బిసి, ఓసి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ ముత్యం వెంకన్న గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్ జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు బెంచ్ ముందుకు వచ్చింది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోడ శివ వాదనలు వినిపిస్తూ, విద్యుత్ సంస్థల్లో వేలాది పదోన్నతులను షరతులతో ఆడ్ హక్ పద్ధతిలో హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను లెక్కచేయకుండా యాజమాన్యాలు పదోన్నతులు ఇస్తున్నారని. ఫలితంగా వందలాది బీసీ, ఓసి ఉద్యోగులకు పైస్థాయి ఉద్యోగాల్లో పదోన్నతులు రావడంలేదని, కాల పరిమితితో హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే తప్ప ఇచ్చిన పదోన్నతులను సమీక్షించే అవకాశం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బదులుగా యాజమాన్యాల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉందని కావున ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని కోర్టుకు విన్నవిచ్చారు. అయినప్పటికీ ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటికే ఏడు సంవత్సరాల కాలం అయిపోయిందని గతంలో డివిజన్ 2018లో ఉత్తర్వులు ఇచ్చిందని, అందువల్ల వేరేబెంచ్ లో ఉన్న రివ్యూ పిటిషన్ విచారణ పూర్తి అయ్యేవరకు మొత్తం విద్యుత్ సంస్థల్లో ఎలాంటి పదోన్నతులు ఇవ్వరాదని మద్యంత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ బిసి, ఓసి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమార స్వామి, వైస్ చైర్మన్ ఆర్ .సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్న గౌడ్, కోకన్వీనర్ సి .భాను ప్రకాష్ తదితర నాయకులు హైకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తూ ఇప్పటికైనా యాజమాన్యాలు మొండి వైఖరిని ప్రదర్శించకుండా వెంటనే పదోన్నతుల సమీక్షించి నష్టపోయిన వందలాది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని. గతంలో యాజమాన్యాలు మొండి వైఖరిచేత పదోన్నతులు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనలో వందల కోట్ల రూపాయల నష్టం సంస్థలకు వాటిల్లిందని. ఇప్పటికే తెలంగాణ సచివాలయంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేసి పదోన్నతులు సమీక్షించారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నారని తెలుపుతూ, వెంటనే సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చొరువచూపి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment