సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ - బింగి స్వామి కె ఆర్ పి ఎస్ అధ్యక్షులు


 

సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ
- బింగి స్వామి కె ఆర్ పి ఎస్ అధ్యక్షులు

సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాలు కురుమ లు నిర్వహించే బీరప్ప పండుగ అని బింగి స్వామి కె ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.చేర్యాల మండలం గుర్జకుంట లో జరుగుతున్న బీరప్ప కామరతి కల్యాణం పెద్దపండుగా  మహోత్సవంలో కురుమ సంఘం ప్రతి నిధులతో  కలిసి పాల్గొని ప్రసంగించారు. కురుమల ఆరాధ్య దేవం  బీరప్ప కామరతి కళ్యాణోత్సవ   ఉత్సవం అంగరంగ వైభరంగ వైభవంగా నిర్వహించారని  కొనియాడారు. గురుజకుంట కురుమ సంఘం ఆహ్వానం మేరకు వచ్చానన్నారు .రాష్ట్రంలో ఉండే ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు పంటలు సమృద్ధిగా పండి సంతోషంగా ఉండాలని కులదైవాన్ని కోరుకున్నానని అన్నారు. కురుమల్లో రాజకీయంగా అత్యంత వెనుక పడ్డారని  ఐక్యంగా . విద్య పరంగా కురుమలు ముందుండాలని గ్రామాల్లో  అన్నదమ్ముల కలిసిపోయే తత్వం కురుమ కులానికి ఉన్న గొప్ప వరం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో కురుమలు బీరప్ప సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ సత్యం న్యాయం ధర్మం వైపు ఉండి నియమ నిష్టలతో వారం రోజులపాటు అంగరంగ వైభవంగా బీరప్ప పండుగను చేసుకుంటామన్నారు. కురుమలు చేసుకునే పెద్ద పండుగను ప్రభుత్వం గుర్తించి ఆ జిల్లా కలెక్టర్ చే పట్టు వస్త్రాలు అందించే కార్యక్రమం చేపట్టాలన్నారు   కురుమలు ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని సాంస్కృతి క వైభవాన్ని కాపాడుతున్న ఒగ్గు బీర్ల కళాకారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్లు హెల్త్ కార్డులు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియాలో ప్రభుత్వం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రసూల్ పుర కురుమ సంఘం అధ్యక్షులు జంగిలి రాజు బి వెంకటేష్ జంగిలి అశోక్ చెవిటి స్వామి కురుమ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు బైర లింగం షీగుల్లా శ్రీశైలం బైకని విష్ణు గురజాకుంట కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు


Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!