ప్రభుత్వ అభివృద్ధి లో పాలుపంచుకునే కాంట్రాక్టర్లను రక్షించాలి - బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి
ప్రభుత్వ అభివృద్ధి లో పాలుపంచుకునే కాంట్రాక్టర్లను రక్షించాలి - బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి
నల్గొండ, గూఢచారి: ప్రభుత్వ అభివృద్ధి లో పాలుపంచుకునే కాంట్రాక్టర్లను రక్షించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డివిఎన్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ సెంటర్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం కాంట్రాక్టర్ల సమస్యలపై చర్చించాలని, వారి బిల్లులు చెల్లించడం జటిలంగా అయినాయని, జిల్లా మంత్రులైన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పౌరసరఫరాల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జిల్లా అభివృద్ధిలో వివిధ పనులు చేసే కాంట్రాక్టర్లను రక్షించుకోవడంతోపాటు చిన్న కాంట్రాక్టర్లు రాష్ట్రం మొత్తంలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు ఆర్ అండ్ బి లో 100 కోట్లు ఇస్తే 22 వందల బిల్లులు క్లియర్ అవుతాయని రోడ్ల మరమ్మతులకు ఐదు వేల నుంచి 20 లక్షల వరకు ఉన్నాయని, వాటిని వెంటనే ఇప్పించాలని ముఖ్యమంత్రిని ఇతర మంత్రులను వేడుకుంటున్నామని అన్నారు. చిన్న కాంట్రాక్టర్ల బిల్లు ఇచ్చి వారికి తోడ్పాటు అందించాలని అన్నారు. కాంట్రాక్టర్లకు వర్క్ షాప్ ఏర్పాటు చేసి ఎంత డబ్బులు ఇస్తారో ఏమేమి పనులు చేయాలో నిర్ణయిస్తే పనులు చేసి ప్రభుత్వానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలో లక్ష మందికి కాంట్రాక్టర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వారిని రక్షించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని, ఒక కాంట్రాక్టర్ ను తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని డబ్బు ఎంతైనా తేవచ్చు అని వీరిని నేలకొరికే లాగా చేయొద్దని కోరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన డివిఎన్ రెడ్డిని జిల్లా సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఫౌండర్ చైర్మన్ కృష్ణారావు, సిడిఐ చైర్మన్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి కోశాధికారి సంతోష్ రెడ్డి నలగొండ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రంగారావు,సత్యనారాయణ, మెదక్ జిల్లా బాధ్యులు సత్యమయ్య, కోకాపేట వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment