చీకటి బతుకుల్లో వెలుగు నింపిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం - కప్పర ప్రసాద రావు


 చీకటి బతుకుల్లో వెలుగు నింపిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం - కప్పర ప్రసాద రావు


సిద్దిపేట ఏప్రిల్ 15, గూఢచారి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలం తీగుల్ నరసాపూర్ లో జై భీమ్ యూత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను కొనియాడారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రమేష్ టిఆర్ఎస్ అధ్యక్షులు స్వామి జై భీమ్ యూత్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!