కరోనా కట్టడకి కేరళ ఏంచేసింది - కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ఎందుకు
STAY HOME STAY SAFE కరోనా కట్టడికి కేరళ ఏంచేసింది. కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ఎందుకు కరోనా కట్టడిలో చర్యలు భళా. కరోనాని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్, భౌతిక దూరం. ఇవి రెండే చాలవు, ఇంకా చాలా చేయాలి. ఆ పని చేసి చూపించింది కేరళలో పి.విజయన్ ప్రభుత్వం. ప్రపంచం మేల్కొనక ముందే కళ్లు తెరిచింది. కరోనా ఎంత భయంకరంగా కమ్మేస్తుందో తెలుసుకుంది ముందుగా జాగ్రత్త పడింది. అదే పదిమందికి స్ఫూర్తినిస్తోంది ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ, కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి వలస కూలీలకు, నిలువ నీడలేని వారికి ఆహార పొట్లాలు అందిస్తోంది. *తిరువనంతపురం:* ప్రాణాంతక నిఫా వంటి వైరస్‌లు, వరదలు వంటి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కొన్న అనుభవం కేరళకి బాగా కలిసి వచ్చింది. భారత్‌లో తొలి కేసు నమోదైన రాష్ట్రమైన కేరళ రికవరీలోనూ ముందుంది. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. చదరపు కిలోమీటర్‌కి 860 మంది వరకు నివసిస్తారు. విదేశీ రాకపోకలు ఎక్కువే. గల్ఫ్ దేశాలలో కేరళ కార్మికులే ఎక్కువ. ఇక చైనాలోని వూహాన్‌లో చదువుకునే వైద్య విద్యార్థులు అధికభాగం కేరళ వారే. 60 ఏళ్ల వయసు పై బడిన జనాభా 12 శాతం. ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు ఎక్...