జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌర సంబంధాల శాఖ, రెవిన్యూ శాఖ మంత్రి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ 2024 డైరీ ని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట వేస్తుంది అన్నారు. జర్నలిస్టుల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే తీరాయని ఇప్పటి ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనతంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి జర్నలిస్టుల సమస్యలు వివరించగా ప్రభుత్వము లో చర్చిస్తా మన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు మాట్లాడుతూ 2012న ఏర్పాటు అయినా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ ఏర్పాటు కోసం అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎక్కువగా నష్టపోయింది జర్నలిస్టులన్నారు. కెసిఆర్ కు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలకు యూనియన్...