Posts

సమభావన సంఘాల మహిళల సమస్యలు గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం

Image
సమభావన సంఘాల మహిళల సమస్యలు గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వంఅని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆరోపించారు                               ..ఈ రోజు ఐద్వా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పిడి డిఆర్డి ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ..ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క ఆమె అమలు చేయడం లేదని అన్నారు గ్రూపు కి పది లక్షల రుణం ఒట్టి మాటలుగానే మిగిలాయి అన్నారు.. మహిళలు పొదుపు చేసుకున్న అభయహస్తం డబ్బులు సుమారు అరవై కోట్లు ఉన్నప్పటికీ పెన్షన్ ఇవ్వడం లేదు లేదా తిరిగి తమ డబ్బు ఇవ్వడంలేదని అన్నారు ఐకేపీ కేంద్రాల్లో పనిచేసిన పొదుపు సంఘం మహిళలకు రెండు సంవత్సరాలుగా కనీసం ఒక్క రూ రూపాయి కూడా చెల్లించలేదని గొడ్డు కష్టం చేయించారని అన్నారు సంఘబంధాల సభ్యులను నెలకొకసారి సమావేశపరిచి డబ్బులు లెక్కలు చూపించాలి కానీ సంవత్సరాలు గడుస్తున్నా పర్యవేక్ష పరిస్థితి లేకపోవడం వలన వేలాది రూపాయలు అవినీతి జరుగుతుందని ఆరోపించారు సంఘబంధం కమిటీని సంవత్సరానికి ఒకసారి మార్పు చేయా...

FLASH FKASH.. నల్లగొండ మున్సిపల్ ఎన్నికలను బ్రేక్

FLASH  FKASH..                            నల్లగొండ మున్సిపల్ ఎన్నికలను బ్రేక్ చేస్తూ హైకోర్టు స్టే విధించింది... 43 వార్డుకు చెందిన బొజ్జ వెంకన్న 41 వార్డుకు చెందినఅలీబాబా హైకోర్టు వెళ్లగా స్టే విధించి ఎన్నికలను బ్రేక్ చేయడం జరిగింది   .

గోలివాడవైపు గోదారమ్మ ★ మేడిగడ్డ నుంచి 96 కి.మీ. ఎదురు ప్రయాణం

★ గోలివాడవైపు గోదారమ్మ ★ మేడిగడ్డ నుంచి 96 కి.మీ. ఎదురు ప్రయాణం ★ నిండుకుండను తలపిస్తున్న సుందిల్ల బరాజ్ ★ గోలివాడ పంప్‌హౌస్‌కు దగ్గరలో జలాలు ★ సోమవారం ఎల్లంపల్లిలోకి ఎత్తిపోత ★ అన్నారం పంపుహౌస్‌లో 4వ మోటర్ ప్రారంభం ★ మొత్తం నాలుగు మోటర్ల వెట్న్ ★ కన్నెపల్లిలో ఆరు మోటర్లతో ఎత్తిపోతలు ★ నేడు ప్రారంభంకానున్న 7వ మోటర్ ★ బరాజ్‌లలో నీటి నిల్వలు ★ మేడిగడ్డ : 5.70 టీఎంసీలు ★ అన్నారం : 7.68 టీఎంసీలు ★ సుందిల్ల : 1.75 టీఎంసీలు గోదావరి జలాలు వ్యతిరేకదిశలో పరవళ్లు తొక్కుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను దాటుకొని మంథని మండలం సిరిపురంలోని సుందిల్ల బరాజ్‌లోకి చేరుతున్నాయి. కన్నెపల్లినుంచి ఆరు మోటర్లతో ఎత్తిపోసిన జలాలతో అన్నారం బరాజ్.. అన్నారం పంప్‌హౌస్‌లోని నాలుగు మోటర్లతో నిరంతరాయంగా ఎత్తిపోసిన నీటితో సుందిల్ల బరాజ్.. నిండుకుండలను తలపిస్తున్నాయి. సుందిల్ల బరాజ్‌లోకి ప్రస్తుతం 1.755 టీఎంసీల నీరు చేరింది. ఇది గురువారం అర్ధరాత్రికల్లా రెండు టీఎంసీలకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. సుందిల్ల బరాజ్‌లోకి భారీగా నీరు చేరుతుండడంతో గోదావరి ఎదురెక్కుతూ అంతర్గాం మండలం గోలివాడలోని సుందిల్ల పంప్‌హౌస్‌వైపు ...

*బ్రేకింగ్....* *పాతబస్తీలో  9కోట్ల స్కాం..*

Image
*బ్రేకింగ్....* *పాతబస్తీలో  9కోట్ల స్కాం..* *అధిక వడ్డి ఆశ చూపి దాదాపు 100మంది నుంచి   లక్షల్లో  వసూలు.* హైదరాబాద్:హైదరాబాద్ పాత బస్తీ సైదాబాద్, మలక్ పేట, డబిర్ పుర ప్రాంతాల్లోని ప్రజల నుంచి డబిర్ పురకు చెందిన సిస్టర్ బుశ్రా, ఆమె భర్త సిరాజ్ర్రహ్మాన్ లు యూ ఐ ఆర్ సి అనే సొసైటీ ద్వారా  ఎంత పెట్టుబడులు పెడితే  దానికి రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మించి  ఒక్కొక్కరి నుంచి 1లక్ష౼90 లక్షలు  వరకు దాదాపు వంద మంది నుంచి 9కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బు తో ఉడాయించారు. బాధితులు డబ్బులు అడిగేందుకు వెళితే వారి కుటుంబీకులు బాధితులపై తమను కొట్టారని ఉల్టా కేసులు  పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. సైదాబాద్ ప్రాంతానికి చెందిన 30 మంది బాధితులు  సైదాబాద్ పోలీసు స్టేషన్ లో  తమ నుంచి 5 కోట్ల డబ్బులు వసూలు చేశారని,వారి నుంచి డబ్బులు ఇప్పించాలని పిర్యాదు చేసారు.  

బీజేపీ మల్లగుల్లాలు

పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మరోమారు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మంగళవారం విశ్వాస పరీక్షలో ఓడి పతనమైన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలి రెండు రోజులైనా ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. నాలుగోసారి సీఎం పీఠం ఎక్కాలన్న యడ్యూరప్ప ఆశ నిరాశ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన వయసుతోపాటు పలు కారణాల రీత్యా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోం.ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నేతల ఆశీర్వాదం కోరుతున్నారు. 75 సంవత్సరాలకు పైబడిన నేతలు చట్టబద్ధ పదవులు చేపట్టకూడదని బీజేపీ గతంలో నిర్ణయించింది. ఈ కారణంతోనే బీజేపీ సీనియర్ నేతలైన అద్వానీ, సుమిత్రామహాజన్ వంటి నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిలుపని సంగతి తెలిసిందే. 76 ఏళ్ల యడ్యూరప్పకు ఆయన వయసే అడ్డంకిగా మారినట్లు కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం మనుగడపై గవర్నర్ వాజుభాయ్ వాల...

చరిత్రలో ఈ రోజు/జూలై 26

*చరిత్రలో ఈ రోజు/జూలై 26*    🌷లైబీరియా స్వాతంత్ర్యదినోత్సవం.🌹 🌹1856 : ఐర్లండుకు చెందిన ఒక ప్రముఖ రచయిత జార్జి బెర్నార్డ్ షా జననం (మ.1950). 🌷1975 : గోరా గా ప్రసిద్ధి చెందిన హేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు మరణం (జ.1902). 🌺1927 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన గులాబ్‌రాయ్ రాంచంద్ జననం (మ.2003). 🌸1935 : కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు కోనేరు రంగారావు జననం (మ.2010). 🌻1956 : ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాసర్ సూయజ్ కాలువ ను జాతీయం చేసాడు. 💐2009 : భారత దేశపు తొట్టతొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు-జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ జలప్రవేశం. 🥀2011 : విమర్శకుడు, ఉత్తమ పరిశోధకుడు, ఆదర్శ ఆచార్యుడు, కవి, నాటకకర్త కొర్లపాటి శ్రీరామమూర్తి మరణం (జ.1929).🌼🌲🍁🎄🍂🌱☘🌿🍃🌴🍀🌹🌷🌺🌸🌻💐🥀

26 జులై పంచాంగం

  శుభమస్తు తేది : 26, జూలై 2019 సంవత్సరం : వికారినామ సంవత్సరం ఆయనం : దక్షిణాయణం మాసం : ఆషాఢమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : శుక్రవారం పక్షం : కృష్ణ (బహుళ) పక్షం తిథి : నవమి (నిన్న రాత్రి 7 గం॥ 17 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 7 గం॥ 51 ని॥ వరకు) నక్షత్రం : భరణి (నిన్న సాయంత్రం 5 గం॥ 36 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 6 గం॥ 52 ని॥ వరకు) యోగము : శూలము కరణం : తైతిల వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 42 ని॥ నుంచి  ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 23 ని॥ వరకు) అమ్రుతఘడియలు : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 48 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 29 ని॥ వరకు) దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 19 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు) రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ వరకు) గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు) యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 5 గం॥ 13 ని॥ వరకు) సూర్యోదయం : ఉదయం 5 గం॥ 53 ని॥ లకు ...